Friday, January 10, 2025

హైదరాబాద్​ టూ బెంగళూరు డ్రగ్స్​ పార్టీలకు సినీ ప్రముఖులు

  • హైదరాబాద్​ టూ బెంగళూరు
  • డ్రగ్స్​ పార్టీలకు సినీ ప్రముఖులు
  • ప్రముఖులతో బెంగళూరులో పార్టీ

బెంగళూరులో రేవ్​ పార్టీ సంచలనం రేపింది. డ్రగ్స్​ పార్టీలు బెంగళూరుకు మారాయి. హైదరాబాద్​లో తనిఖీలు ఎక్కువ కావడంతో.. సెలబ్రిటీలు బెంగళూరు ఫ్లైటెక్కుతున్నారు. ఇదే తరహాలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు పార్టీ ప్లాన్ చేశారు. ముప్పై నుంచి యాభై లక్షలు ఖర్చు చేసి ఒక్కరోజు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎట్టకేలకు నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ బట్టబయలు చేశాయి. ఈ పార్టీలో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలకు సంబంధించిన వారు పాల్గొనడంతో.. వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ పార్టీ కోసం ఏపీ, తెలంగాణ నుంచి విమానాల్లో వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

లీడర్లు టాలీవుడ్​ సెలబ్రిటీలు

బెంగళూరులో జల్సా చేస్తూ 100 మందికిపైగా సెలబ్రిటీలు పోలీసులకు చిక్కారు. ఈ పార్టీకి పలువురు లీడర్లు, టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌పై సెంట్రల్‌ క్రైమ్ బ్రాంచ్‌ దాడి చేసింది. జీఆర్​ ఫామ్‌హౌస్‌లో తెల్లవారుజాము 3గంటల వరకు పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబడటం సంచలనంగా మారింది. 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు, ఏపీ, తెలంగాణ నుంచి 100 మందికి పైగా హాజరయినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇక, జీఆర్​ ఫామ్‌హౌస్‌.. అంటే గోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ గా అనుమానిస్తున్నారు. కాన్ కార్డ్ యజమాని గోపాల్‌రెడ్డి.. ఈయన ఫామ్‌హౌస్‌లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగిందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ కోసం వెతుకుతున్నారు. అతని పుట్టినరోజును ఇంత గ్రాండ్‌గా ఎందుకు ప్లాన్ చేశారు..? 100 మందిని పిలిచారు.. ఇందులో వీవీఐపీలు, సెలబ్రిటీలు ఎందుకు ఉన్నారనే కోణాల్లో విచారణ సాగుతున్నది. బెంగళూరు సెంట్రల్‌ క్రైమ్ బ్రాంచ్‌ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది.

కాకాణి కారు

ఈ రేవ్‌ పార్టీకి హైఎండ్‌, పోష్‌ కార్లు చాలా వచ్చాయ్‌. వాటిల్లో ఓ బెంజ్‌ కార్‌ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆ కార్‌పై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్టిక్కర్‌ ఉంది. ఈ కారుతో తనకు ఎలంటి సంబంధం లేదని, ఆ కారు తనది కాదని.. తన పేరును ఎవరో వాడుకుంటున్నారని కాకాణి పోలీసులకు చెప్పుకొచ్చారు. కానీ, పోలీసులు పలు రకాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు చెప్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్కులేట్ అవుతోంది. చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com