- అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో నేర్పిస్తున్నది: సీఎం రేవంత్
అధికారులు ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నీటి పారుదల శాఖలో కొత్తగా చేరిన 700 మంది ఏఈఈలకు సీఎం చేతుల మీదగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణనే, మన కళ్లముందున్న కాళేశ్వరం ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు సీఎం చేతుల మీదగా అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
ఉన్నత అధికారులు చెప్పారని నాణ్యత, నిబద్ధత విషయంలో ఎప్పుడూ రాజీపడొద్దని సూచించారు. నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని, నాణ్యతగా లేకుంటే.. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నేళ్లు ఉండేవి కావని సీఎం వివరించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు లక్షల ఎకరాలకు నీళ్లు, విద్యుత్ ఇస్తున్నాయన్నఆయన, ఐదేళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం అప్పుడే కూలిపోయిందని ఆక్షేపించారు.
ఒక దేశం గొప్పతనాన్ని చెప్పేది ఆ దేశంలోని నిర్మాణాలు, కట్టడాలే : నిర్మాణం కంప్లీట్ కాకముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా అధ్యయనం చేయాలని, ఈ ప్రాజెక్టును గత పాలకులు ప్రపంచ అద్భుతంగా వర్ణించారు కదా మరి దీనికి ఎవరిని బాధ్యులుగా చేయాలని సీఎం ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు సమర్థంగా పనిచేసి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. నిర్మాణ సామగ్రి క్వాలిటీగా లేదని ఇంజినీర్లు వెనక్కి పంపి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. ఒక దేశం గొప్పతనాన్ని చెప్పేది ఆ దేశంలోని నిర్మాణాలు, కట్టడాలేనని సీఎం రేవంత్ పేర్కొన్నారు.