Wednesday, January 22, 2025

స్విట్జ‌ర్లాండ్‌లో అరుదైన క‌ల‌యిక‌

తెలుగు రాష్ట్రాల‌ సిఎంల భేటీ
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సీఎంలు మంత్రులు హాజరయ్యారు. మంత్రులతో కలిసి దావోస్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో అరుదైన కలయిక జరిగింది. జ్యూరిచ్‌ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం.. అదే ఎయిర్‌ పోర్టులో అప్పటికే అక్కడ ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు, మంత్రులు ఒకే చోట కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. చిత్రంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్‌, శ్రీధ‌ర్‌ బాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహననాయుడు ఉన్నారు. మంత్రి శ్రీధ‌ర్‌ బాబు భుజంపై చేతులేసి.. షేక్‌ హ్యాండ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు. ఉదయం జ్యూరిచ్‌ ఎయిర్‌ పోర్టులో వీరి మీటింగ్‌ జరిగింది.తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులపై లక్ష్యంగా.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారుల బృందం దావోస్‌ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com