UPSC సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 1016 మందిని ఎంపిక చేయగా.. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్ వచ్చింది. దొన్నూరు అనన్య రెడ్డికి 3వ ర్యాంకు వచ్చింది. 347 మంది జనరల్ కేటగిరీలో, 303 OBC కేటగిరీలో, 165 SC కేటగిరీలో, ST కేటగిరీలో 86 మంది ఎంపికయ్యారు
సివిల్స్ -2023 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్కు ఎంపికవటం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు