సింగిల్ డిజిట్‌కే పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై.. ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అత్యల్పంగా హైదరాబాద్‌లో 6.2 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పటాన్‌చెరులో 7డిగ్రీలు, మెదక్‌లో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 11.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శీతలగాలుల నేపథ్యంలో ఇప్పటికే ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.