Sunday, April 20, 2025

సైబరాబాద్‌ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

సైబరాబాద్‌ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని శంషాబాద్‌ పీఎస్‌కు తరలిస్తున్నారు. అయితే, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై బీఆర్‌ఎస్‌ నేతలు అభ్యంతరం తెలిపారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేశారు. అరెస్టు చేయకపోతే కోర్టు వెళ్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే గాంధీ అనుచరులు, కాంగ్రెస్‌ కార్యక్తలు దాడి చేసిన విషయం తెలిసిందే.

Tension at Cyberabad CP office arrest of BRS leaders including Harish Rao

కౌశిక్‌రెడ్డి ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. కొండాపూర్‌లోని కౌశిక్‌ రెడ్డి నివాసానికి వచ్చిన గాంధీని పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే, దాడిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ సీపీ ఆఫీస్‌ వద్ద ఆందోళనకు దిగింది. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు.

దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టులకు దిగారు. బీఆర్‌ఎస్‌ నేతలను ఈడ్చుకుంటూ వాహనాల్లో పడేశారు. ఈ క్రమంలో హరీశ్‌రావును పోలీసులు లాక్కువెళ్లేందుకు ప్రయత్నించగా హరీశ్‌రావు కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తున్నది

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com