- ఐదుగురు అనుమానితులను పోలీసుల అదుపులో
- వంట చేసే సిబ్బందే వీడియోలు తీశారని ఆరోపిస్తున్నా విద్యార్థినులు
HYD మేడ్చల్ CMR ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో మొబైల్ వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని నిరసన తెలుపుతున్నారు. వంట చేసే సిబ్బందే వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.