Tuesday, April 22, 2025

ఇంజినీరింగ్​లో మిగులు సీట్లు 5039 తుది విడుత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

టీజీ ఎప్‌సెట్ తుది విడుత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. తుది విడుత‌లో 9881 సీట్లు భ‌ర్తీ కాగా, ఇప్పటి వ‌ర‌కు 94.20 శాతం సీట్ల కేటాయింపు జ‌రిగింద‌ని అధికారులు తెలిపారు. మొత్తంగా 86,943 సీట్లు ఉండ‌గా, ఇప్పటి వ‌ర‌కు 81,904 సీట్లను భ‌ర్తీ చేసిన‌ట్లు పేర్కొన్నారు. మ‌రో 5039 సీట్లు మిగిలి ఉన్నాయ‌న్నారు. ఇందులో గ‌వ‌ర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 93, యూనివ‌ర్సిటీ కాలేజీల్లో 1056, ప్రయివేటు యూనివ‌ర్సిటీల్లో 19, ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 3871 సీట్లు మిగిలి ఉన్నట్లు తెలిపారు.

ఇక తుది విడుత‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఎప్‌సెట్ వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు, త‌ల్లిదండ్రుల ఖాతాల ద్వారానే ఫీజు చెల్లించాల‌ని అధికారులు సూచించారు. 15వ తేదీలోపు ఫీజు చెల్లించి, సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనంత‌రం 13 నుంచి 17వ తేదీ లోపు ఒక జ‌త జిరాక్స్ కాపీల‌ను, ఒరిజిన‌ల్ టీసీని సంబంధిత కాలేజీలో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com