ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్
తెలంగాణ సంక్షిప్త పదాన్ని టిఎస్ బదులుగా టిజిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీఓలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో టిజిగానే ఉండాలని ఆమె ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ దీనినే పాటించాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు.