విషయం తెలుసుకున్న ఆర్ఎంపీలు పరుగో పరుగు:
తెలంగాణా వైద్య మండలి చైర్మన్ డా మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య ఆదేశాల మేరకు సభ్యులు డా రాజకుమార్ ఆధ్వర్యంలో ని యాంటీ క్వేకరి బృందం నకిలీ వైద్యుల సెంటర్స్ పై తనిఖీ లు నిర్వహించారు.
ఈ తనిఖీలలో బెల్లంపల్లిలో గిరీష్ విశ్వాస్ క్లినిక్ శిశుమందిర్ రోడ్ , మహేశ్వరి ల్యాబ్ కాంట్రాక్టర్, సోమగూడెంలో అతిక్ ఖాన్ 786 క్లినిక్ మరియు పలు నకిలీ వైద్యులు అల్లోపతి వైద్యం చేస్తూ పట్టుబడ్డారు. పలు సెంటర్స్ ఓపెన్ చేసి అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారని వెలుగులోకి వచ్చింది. ఈ తనిఖీల గురించి సమాచారం తెలుసుకుని నకిలీ వైద్యులు వారి క్లినిక్లను, ల్యాబ్స్ ని, పర్మిషన్ లేని మెడికల్ షాప్స్ ని మూసి వేశారు.
తనిఖీ చేసి వారు విచ్చలవిడిగా ఆంటిబయోటిక్స్, స్టెరోయిడ్స్ ఇస్తునట్టు గుర్తించి తగు ఆధారాలు సేకరించారు.
Nmc చట్టం 34,54 ప్రకారం వీరిపై కేసు నమోదు చేయనున్నారు.
చట్ట ప్రకారం అర్హత లేని వ్యక్తులకు ట్రైనింగ్ ఇవ్వడం, ప్రాక్టీస్ చేయడం చట్ట విరుద్దo అని గతం లో కూడా దేశం లో ఎక్కడ లేని విధంగా పలు సార్లు జి.ఒ లు ఇవ్వగా కోర్టు లు ఆ జి.ఒ లను రద్దు చేసిందని గుర్తు చేసారు.
రాష్ట్రవ్యాప్తంగా టీజీఎంసి యాంటీక్యాకరీ కమిటీ కి సంబంధించిన 30 బృందాలు అన్ని జిల్లాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారని, అర్హత లేకుండా హేతుబద్ధతలేని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని టీజీఎంసి మెంబర్ డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారు హెచ్చరించారు
ఈ తనిఖీలలో ఆంటీ క్వాకరీ బృందం సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ డాక్టర్ యశ్వంత్ శ్రావణ్ కుమార్ ప్రమోద్ కుమార్ గారు పాల్గొన్నారు