Saturday, January 4, 2025

సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు

ముంద‌స్తుగా ఏర్పాట్లు చేపట్టిన టిజి ఆర్టీసీ

సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. హైదరాబాద్‌ ‌నుంచి తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్‌కు కూడా ప్రత్యేక బస్సులను నడుపనుంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ ‌సదుపాయం కల్పించింది. గతేడాది సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించగా.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో 5,246 బస్సులను నడిపింది. గత సంక్రాంతి అనుభవాల దృష్ట్యా ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 9 నుంచి 15  వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, ‌జేబీఎస్‌, ఉప్పల్‌ ‌క్రాస్‌ ‌రోడ్స్, ఆరాంఘర్‌, ఎల్‌బీనగర్‌ ‌క్రాస్‌ ‌రోడ్స్, ‌కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్‌ ‌బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను ఆర్టీసీ నియమించింది. అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమహేంద్రవరం, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి.

తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్‌ ‌నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంక్రాంతికి కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, ‌వరంగల్‌ ‌నుంచి ఎలక్ట్రి ‌బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ‌ప్రెస్‌, ‌సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ‌ప్రెస్‌ ‌బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుందని తెలిపింది. ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లు తీసుకోవాలని వివరించింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను  చేసుకోవాలని పేర్కొంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్‌ ‌సెంటర్‌ 040-69440000, 040-23450033 ‌నంబర్లకు సంప్రదించాలని సూచించింది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com