Wednesday, November 6, 2024

‘తండేల్’ ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే.. హీరో నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావస్తుండగా, రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తండేల్ ఫిబ్రవరి 7, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాలెంటైన్స్ డే కి ముందు సినిమా రిలీజ్ కావడం, సీజన్‌లోని రొమాంటిక్ మూడ్‌ను క్యాపిటిలైజ్ చేసుకునే పర్‌ఫెక్ట్ గా ప్లాన్‌ చేసినట్లు ఉంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో లీడ్ పెయిర్ నాగ చైతన్య మరియు, పల్లవి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇది అందమైన సముద్ర నేపథ్యంలో సెట్ చేయబడింది. ఈ పోస్టర్ వారి పాత్రలు మధ్య డీప్ లవ్ ని సూచిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. బ్లాక్‌బస్టర్ హిట్ ‘లవ్ స్టోరీ’ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జోడిని మరోసారి తెరపై చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్నారు.
హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నమస్కారం. నా కెరీర్‌లో ఇప్పటి వరకు రిలీజ్‌ డేట్‌ను ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్‌ చెబితే బాగుండేదని అనుకునేవాడిని. ఒక యాక్టర్ కి రిలీజ్ డేట్ ఎప్పుడు అని తెలుసుకోవాలని వుంటుంది. అరవింద్ గారికి రిలీజ్ డేట్ గురించి అడిగాను. ఆయన ముందు సినిమా చూపించండని అడిగారు. నేను అనుకున్న సినిమా అక్కడ కనిపిస్తే రిలీజ్ డేట్ చెప్తాను అన్నారు. ఆ మాట ఆయన అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా అంటే ఇలానే తీయాలి. ఇది మామూలు సినిమా కాదు. శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారుల జీవితం. వారి కష్టం దేశం అంతా షేక్ చేసింది. మేము ఎడిట్ చూశాం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే అవుతుంది. ఫిబ్రవరి7 డేట్ పై నేను చాలా సంతోషంగా వున్నాను. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉన్నాం. 100% లవ్ సినిమాతో వాసు తో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయనతో మళ్ళీ ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్‌ గురించి వినగానే నాకు చేయాలని అనిపించింది అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular