Friday, May 23, 2025

‘థాంక్యూ డియర్’ ఫస్ట్ లుక్

టాలీవుడ్‌లో యువ కథానాయకుడు ధనుష్ రఘుముద్రి నటించిన ‘థాంక్ యూ డియర్’ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఘనంగా జరిగింది. ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి, చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ, ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెస్తుందని, యువ బృందానికి ఆశీస్సులు అందజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ, ‘థాంక్ యూ డియర్’ తన రెండో చిత్రమని, తమ్మారెడ్డి లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ తమ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో కీలకమైనదని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుందని, తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం తమకు ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

 

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com