ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా
ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రజలకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఆటా మహాసభల కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అందరూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇదే సందర్భంలో డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 30 వరకు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఆటా సేవ కార్యక్రమాలను విజయవంతం చేసిన ఆటా సభ్యులకు, కార్యక్రమాలకు నిధులు ఇచ్చిన యాజమాన్యాలకు, ప్రత్యేక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అలాగే 2024 జూన్ 7,8,9 తేదీలలో అట్లాంటాలో నిర్వహించే ఆటా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.