భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని శిక్షించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే సమాచారం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏటా కోట్లాది మంది దర్శించుకునే తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేది ప్రజల విశ్వాసానికి తూట్లు పొడవడమే అవుతుందన్నారు. ప్రధానంగా హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని శనివారం నాడు ఒక ప్రకటనలో కిషన్ రెడ్డి వెల్లడించారు.
లడ్డూ ప్రసాదంను కల్తీ చేయడం క్షమార్హం ఎంత మాత్రం కాదన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన నేరస్థులకు తగిన శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దిశగా పోలీసు యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్తాయని తాను ఆశిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలేవీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
దీంతో పాటు తిరుపతిలో అన్య మత ప్రచారం, తిరుమల కొండపైకి మద్యం, మాంసాహారాన్ని తీసుకెళ్లడం, టీటీడీలో అవినీతి అక్రమాలు గత కొన్నేళ్లుగా పతాక శీర్షికలవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని, హిందూ ధార్మిక విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర గతంలో జరిగిన నేపథ్యంలో వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులను శిక్షించి, తిరుమల పవిత్రతను కాపాడి, భక్తుల మనోభావాలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తిరుపతి లడ్డూ వివాదంపై చంద్రబాబుకు టీడీ ఈవో నివేదిక ప్రజల మనోభావాలు అంటే లెక్కలేకుండా గత ప్రభుత్వం వ్యవహరించింది శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో రివర్స్ టెండర్లు ఏంటి? తప్పులు, పాపాలు చేసి మళ్లీ సిగ్గులేకుండా బుకాయిస్తున్నారు. ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ…
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వార్తలపై రాహుల్ గాంధీ ఆందోళన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు వెంకటేశ్వరస్వామి ఆరాధ్య దైవమన్న రాహుల్ లడ్డూ విషయం ప్రతి ఒక్క భక్తుడినీ బాధపెడుతోందని వ్యాఖ్య తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదంపై లోక్ సభలో ప్రతిక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారనే వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.…
కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఆందోళనవ వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం ఆఖరికి సుప్రీం కోర్టును కూడా తాకింది. గత వైసీపీ పాలకుల వైఫల్యమేనంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్…