రూ.2 లక్షల 91వేల 159 కోట్లతో తొలి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
శాఖల వారీగా కేటాయింపులు ఇలా…
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజా పాలనే లక్ష్యమంటూ ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను సభలో గురువారం ప్రవేశపెట్టగా మొత్తం 2 లక్షల 91వేల 159 కోట్ల రూపాయల అంచనాలతో ఈ పద్దును రూపొందించింది. అందులో వ్యవసాయానికి అత్యధికంగా సుమారు 25 శాతం నిధులు కేటాయించింది. అయితే గత ప్రభుత్వం 2022, 23 సంవత్సరంలో రూ.2,04,523 కోట్లను, 2023, 24 సంవత్సరంలో 2,90,396 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం 2024, 25 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను 2,91,159 కోట్లతో ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలకు రూ.40 వేల కోట్ల పైచిలుకు నిధులను కేటాయించగా,ప్రస్తుత ప్రభుత్వ మాత్రం రూ.72,659 వేల కోట్ల నిధులను కేటాయించడం విశేషం.
రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు
ఈసారి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాగునీటి రంగాలకు సైతం దండిగానే ప్రభుత్వం నిధులు కుమ్మరించింది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులున్నా ప్రజల ఆకాంక్షలు, హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి పద్దును శాసనసభలో ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోలిస్తే కాస్త ఎక్కువగా 2 లక్షల 91వేల 159 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ పద్దును ప్రవేశపెట్టగా అందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో బడ్జెట్‌లో వివిధ రంగాలకు శాఖల వారీగా నిధులను కేటాయించారు. అందులో వ్యవసాయశాఖ, దాని అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు, సంక్షేమానికి రూ.40 వేల కోట్లు, సాగునీటి రంగానికి రూ.26 వేల కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు, హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు, జీహెచ్‌ఎంసీలో మౌలిక వసతులకు రూ.3,065 కోట్లు, రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు, హోంశాఖకు రూ.9,564 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం వివిధ రంగాలకు ఇలా కేటాయింపులను చేసింది.
శాఖ కేటాయింపులు (కోట్లలో)
వ్యవసాయం ,కోఆపరేషన్ శాఖలకు రూ.-49,383
పశుసంవర్ధక శాఖ రూ.1,980
వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ రూ.9,200
విద్యుత్ శాఖకు రూ.16,410
అడవులు, పర్యావరణం- రూ.1,064
ఆర్థికశాఖకు రూ.47,713
ఫుడ్ అండ్ సివిల్‌సప్లయి రూ.3,836
జనరల్ అడ్మినిస్ట్రేటివ్ రూ.1,134
వైద్య ఆరోగ్యం- రూ.11,468
ఉన్నత విద్యాశాఖ రూ.3,350
హోంశాఖకు రూ.-9,564
హౌసింగ్ శాఖకు రూ.9,184
పరిశ్రమలు అండ్ కామర్స్ శాఖకు రూ.2,762
ఇరిగేషన్ శాఖ రూ.22,301
లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్‌కు రూ.882
లా డిపార్ట్‌మెంట్ రూ.2,306
లేజిస్ల్రేచర్‌కు రూ.220
మైనార్టీ శాఖకు రూ.3,003
మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్భన్ డెవలప్‌మెంట్ రూ.15,594
పంచాయతీ రాజ్-కు రూ.29,816
ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌కు రూ.3,783
రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు రూ.2,106
షెడ్యూల్ తెగలు, అభివృద్ధి శాఖ రూ.7,638
ప్రాథమిక విద్య, సెక్రటేరియట్ శాఖ రూ.17,942
రవాణా శాఖ రూ.4,206
రవాణా, రోడ్లు, భవనాల శాఖ రూ.5,790
ట్రైబుల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ రూ.3,969
స్త్రీ, శిశు సంక్షేమ, దివ్యాంగుల, సీనియర్ సిటీజన్స్‌కు రూ.2,736
యూత్ అడ్వాన్స్, టూరిజం అండ్ కల్చరర్ డిపార్ట్‌మెంట్ రూ.1,046
మొత్తంరూ.2,91,159 కోట్లు.