Sunday, December 29, 2024

రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్షంగా

నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలి
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయడమే లక్ష్యంగా పని చేయాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ 100 సంవత్సరాల ఉత్సవాలకు పిసిసి అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో అనుబంధ సంఘాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, సేవాదల్ కాంగ్రెస్‌లో చాలా ముఖ్యమైన భూమిక పోషించిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో అనుబంధ సంఘాల చైర్మన్‌లకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇచ్చి గౌరవించామని, సేవాదల్ కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ గ్రామస్థాయి, మండల స్థాయి కార్యకర్తలకు ఆయా స్థాయిల్లో ప్రాధాన్యత ఇస్తామని పిసిసి అధ్యక్షుడు తెలిపారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తల కృషి ఫలితంగా ఏర్పడిందని, మీ కష్టానికి తప్పకుండా ఫలితాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు అంతా నిత్యం ప్రజల్లో ఉండి సేవలు చేస్తున్నారని, రైతులకు 2 లక్షల రుణ మాఫీ కోసం 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అంతేగాక పదేళ్లలో కెసిఆర్ ప్రభుత్వం చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిందని, 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పాలకులదని ఆయన తెలిపారు. ఇక మహాత్మాగాంధీ, నెహ్రులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, బిజెపి చరిత్రను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేసి రాజకీయంగా కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు దేశంలో పాదయాత్ర చేశారని, ఆయన్ను ప్రధాని చేయాలన్న లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com