Saturday, September 14, 2024

ఎమ్మెల్యేల తీరు సరిగా లేదు.. చెడ్డ పేరు వస్తోంది: చంద్రబాబు ఫైర్

ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నాళ్లు తాను సంపాదించుకున్న మంచి పేరు దెబ్బతింటోందని ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

“ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల ఇన్నాళ్లుగా సంపాదించుకున్న మంచి పేరు దెబ్బతింటోంది. వారు చేసిన పొరపాట్ల గురించి వార్తలొస్తున్నాయి. దీనివల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోంది. మంత్రులు జాగ్రత్తగా ఉండాలి. తమ తమ జిల్లాల్లోని నాయకులకు మంత్రులే దిశానిర్దేశం చేయాలి. ఇలాంటివి జరగకుండా చూడాలి” అని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular