Monday, September 30, 2024

దేశంలోనే పెద్ద కరెన్సీ నోటు..ఎందుకు రద్దు చేశారంటే?

భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు ఏది అంటే.. అందరూ రూ.2000 నోటనే చెబుతారు. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తరువాత రెండు వేలరూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. కానీ.. నిజానికి భారదేశంలో స్వాతంత్య్రం రాకముందే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.10000, రూ.5000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వీటి గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారదేశంలో ప్రవేశపెట్టిన రూ10000 నోటు.. అతిపెద్ద డినామినేషన్‌గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారాలు, వ్యాపారులు అధిక-విలువ లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్‌ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946లో వీటిని ఆరికట్టింది.

ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954లో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఆ తరువాత 1978 వరకు చెలామణి అవుతూనే ఉన్నాయి. ఆ తరువాత 1978లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే.. రూ.5,000 నోట్లతో పాటు రూ.10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నోట్లను సామాన్య ప్రజలు చాలా తక్కువగా ఉపయోగించేవారు. కాబట్టి ఈ నోట్ల రద్దు ఎవరిమీదా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 1976 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదు రూ.7,144 కోట్లు. ఇందులో రూ.1,000 నోట్లు రూ.87.91 కోట్లు. అంటే మొత్తం డబ్బులో రూ. 10000 నోట్ల శాతం 1.2 శాతం మాత్రమే. రూ. 5000 నోట్లు రూ.22.90 కోట్లు మాత్రమే. రూ.10000, రూ.5000 నోట్ల రద్దు తరువాత మళ్ళీ ఇలాంటి పెద్ద నోట్లు మళ్ళీ రాలేదు. ఆ తరువాత రూ. 2000 నోట్లు వచ్చాయి, రద్దయిపోయాయి. ఇప్పుడు భారదేశంలో అతిపెద్ద కరెన్సీ అంటే రూ. 500 నోటు అనే చెప్పాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular