ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలి
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సీతక్క
ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసుల సంఘాల భారీ ర్యాలీ
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ములుగులో ఆదివాసి, గిరిజన,. బహుజన ప్రజా సంఘాలు బుధవారం భారీ ర్యాలి నిర్వహించాయి. అనంతరం ఆదివాసి సంఘాల నేతలు క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం సమర్పించారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్కను విజ్ఞప్తి చేశారు. ఆదివాస సంఘాల వినతికి మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఛతీస్ గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాలు మధ్య భారతంలో భాగంగా ఉన్నాయి. షెడ్యూల్ 5 ప్రాంతాలు అయిన ఏరియాలో విస్తారంగా ఆదివాసులు నివాసం ఉంటున్నారు.
గత సంవత్సర కాలంగా కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున అక్కడ మోహరించినట్లు, ఆదివాసీ సంఘాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కేంద్ర బలగాలు భారీ ఎత్తుగా మోహరించి ఆదివాసి జీవన ఆధారమైన అడవికి వెళ్లకుండా వారి ఇంట్లో నుంచి బయటికి రాకుండా బంధించడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.
బలగాలు మోహరించడం వల్ల ఆదివాసులకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఆదివాసుల జీవన ఆధారం కోల్పోయే విధంగా ఈ బలగాలు వ్యవహరించడం వారి రోజు వారి పనికూడా చేయనియకుండా భయభ్రంతులకు గురి చేస్తున్నారన్నారు. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపి ఆదివాసుల జీవనానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. వేసవిలో ప్రకృతిలో లభించే ఫలాలు ఆదివాసులు సేకరించి జీవనం గడుపుకుంటారని, కానీ, ఇప్పుడు కేంద్ర బలగాలు మోహరించడం వల్ల వారు ఇండ్ల నుంచి కూడా బయటికి రాకుండా వారి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసుల జీవనంపై దెబ్బతీసి, వారి మానసిక ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి బలగాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ కగార్ వల్ల ఆదివాసులు మానసికంగా, ఆర్థికంగా దెబ్బతిన పరిస్థితి ఉందని తెలిపారు. ఆదివాసుల ఆధారపడి ఉన్న అడవికి వెళ్లనీయకుండా, జీవన విధానంపై వారిని ఆర్థిక ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉందని, ఆదివాసుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న ఆపరేషన్ కంగార్ ను తక్షణమే ఆపాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.