Friday, April 4, 2025

ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ

ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టో తెలుగు ప్రతిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో వివరించింది.

హైదరాబాద్‌కు బిజెపి రద్దు చేసిన ఐటీఐఆర్‌ను పున: ప్రారంభిస్తామని కాంగ్రెస్ తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు , మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నాలుగు నూతన సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఈ హామీల్లో ప్రకటించింది. మొత్తం 23 హామీలను కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ హామీలు తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే…
1. హైదరాబాద్‌కు ఐటిఐఆర్ ప్రాజెక్ట్.
2. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాద్‌లో ఐఐఎమ్, హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే పక్క నుంచి రాపిడ్ రైల్వే వ్యవస్థ, మైనింగ్ యూనివర్సిటీ.
3. భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం ఆంధ్రాలో విలీన అయిన ఐదు గ్రామాలు అయినా ఏకపాక, గుండాల, పురుషోత్తం పట్నం, కన్నెగూడెం, పిచుకల పాడులను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం.
4.పాలమూరు -రంగారెడ్డికి జాతీయ హోదా
5. నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు
6. నూతన ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటు
7. రామగుండం -మణుగూరు నూతన రైల్వేలైన్‌ల ఏర్పాటు
8. నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు
9. కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు
10. నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపు
11. జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు
12. ఐఐఎస్‌ఈఆర్ (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు
13. ఐఐఎఫ్టీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్) ఏర్పాటు
14. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) క్యాంపస్ ఏర్పాటు
15. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు
16. ఐసీఎంఆర్ పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు
17. 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచ్‌ల నేరుగా బదిలీ.
18. ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు
19. ఇండస్ట్రీయల్ కారిడార్ల ఏర్పాటు
20. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడి సాంస్కృతిక, వినోద కేంద్రం ఏర్పాటు
21. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా
22. డ్రైపోర్ట్ ఏర్పాటు
23. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు హామీలను కాంగ్రెస్ తెలంగాణ స్పెషల్ మేనిఫెస్టోలో పొందుపరిచింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com