-
వంద రోజుల్లో వందకు పైగా సంక్షేమము, అభివృద్ధి హామీలు నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది
-
రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం యొక్క 100రోజుల NDA పాలన – 100 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా,నేడు సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల యర్రయ్యగారి పల్లి లో పర్యటించి NDA ప్రభుత్వం ఈ 100రోజుల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నరాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీ మతి సవితమ్మగారు.
👉 యర్రయ్య గారి పల్లె నుండి మేరెడ్డి పల్లి వరకు 1 కోటి 14 లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్ నిర్మాణంకు శంకుస్థాపన చేసారు.
👉 ఎర్రయ్యగారిపల్లిలో ఎంపీపీ స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికై 14 లక్షల నిధులతో భూమి పూజ చేశారు.
👉యర్రయ్యగారి పల్లి లో సీసీ రోడ్డు నిర్మాణానికి 8 లక్షల నిధులతో భూమిపూజ చేసిన
రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జోలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు .
అనంతరం మంత్రి సవితమ్మ గారు మాట్లాడుతు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కూటమి ప్రభుత్వంలో అర్హులైన పేదలకు అన్ని పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. 2 ఏళ్లుగా పెన్షన్లు ఇవ్వకుండా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పేదల పింఛన్ల పెంపుకు 5 ఏళ్లు తీసుకుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పెద్ద కొడుకు గా బాధ్యత గా అధికారంలోకి రాగానే పెంచి, పేదలకు భరోసా ఇచ్చారు.
అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు గురించి త్వరలో ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుందని మంత్రి సవితమ్మ గారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో అధికారులు తెలుగుదేశం, జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.