Thursday, December 26, 2024

మహిళను విమానం నుంచి గెంటేసిన సిబ్బంది

విమాన ప్రయాణాల్లో అప్పుడుప్పుడు వింత ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. సూరత్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం నుంచి ఒక మహిళను భద్రతా సిబ్బంది బలవంతంగా దించేశారు. ఈ ఘటనతో ఆ ప్లైట్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కొంత ఆందోళన చెందారు. విమానంలో మహిళ తన సీటు విషయమై భద్రతా సిబ్బందితో గొడవపడినట్లు ప్రయాణికులు చెప్పారు. ఆమెకు సరియైన సీటు దొరక్కపోవడంతో అసహనంతో భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. విమానంలో ప్రవేశించినప్పటి నుంచి క్యాబిన్ సిబ్బందితో గొడవ పడి హంగామా చేసిందట.
ఆమె క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూ, దుర్భాషలాడినట్లు తోటి ప్రయాణికులు తెలిపారు. ఫ్లైట్ లోని భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. చివరికి సదరు మహిళను ఇద్దరు మహిళా భద్రతా అధికారులు బలవంతంగా విమానం నుంచి కిందకు దించేశారు. ఈ పరిణామం విమానంలోని ప్రయాణికులను ఒకింత షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన కారణంగా విమానం గంట పాటు ఆలస్యమైంది. దీన్నంతా విమానంలో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బాగా వైరల్ అవుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com