పత్రికా ప్రకటన
రాజమహేంద్రవరం, తేదీ: 10.9.2024
** ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మంగళవారం సాయంత్రం కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
** సాయంత్రం నాటికి బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్కుల దాటే అవకాశం
** గోదావరీ నదికి బుధవారం ఉదయం 12 నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం
*” రేపు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
** గణేష్ నిమజ్జనం కు ఏర్పాట్లు పూర్తి చేశాం
** వరద ఉధృతి నేపధ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరులను అనుమతించం
** ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగం కు విగ్రహాలు అందచెయ్యాలి
** జిల్లా ప్రజలకు కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి
వాతావరణ శాఖ హెచ్చరికల గోదావరి కి వరద హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు.
మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నుండి ఈమేరకు ఒక వీడియో సందేశం ఇవ్వడం జరిగింది.
రెవిన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలను తరలింపు, వరద నీరు చేరే మార్గాలలో హెచ్చరికల జారీ చేసి ప్రజలను అప్రమత్తం చెయ్యాడం జరుగుతోందని తెలిపారు.
భద్రాచలం వద్ద 47.50 అడుగులు రెండవ ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి గోదావరి జిల్లాలను విడుదల చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ధవలేశ్వరం ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం 8. 36 లక్షల నీటిని క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. మంగళవారం సాయంత్రానికి 10 లక్షలు చేరుకుని మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందన్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రేపు ఉదయానికి 12 నుంచి 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరే అవకాశం ఉన్న దృష్ట్యా రెండోవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మత్స్యకారులు ఎవరు గోదావరిలోకి వెళ్లవద్దని, వరద ప్రవాహాన్ని చూసేందుకు , సెల్ఫీలు దిగేందుకు ఎవరు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గోదావరి చాలా ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఎవ్వరూ గోదావరిలోకి వెళ్లవద్దని, ముఖ్యంగా పిల్లలు విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు అధికారులు సూచన పాటించి పునరావాస కేంద్రాలకు తరలిరావాలన్నారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం
గణేష్ నిమజ్జనం కు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. వరద ఉధృతి నేపధ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరులను అనుమతించమని, ఆయా ప్రదేశాల్లో ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగం కు విగ్రహాలు అందచెయ్యాలన్నారు. రాజమహేంద్రవరం కొవ్వూరు తాడిపూడి సీతానగరం తదితర ప్రాంతాల్లో గుర్తించిన ఘాట్లో వద్ద విగ్రహాల నిమజ్జనం చెప్పట్టనున్నట్లు తెలిపారు. గోదావరి ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలన్నారు.. మొదటి ప్రమాద హెచ్చరిక ను అనుసరించి బోట్ల ను గోదావరిలోకి అనుమతించమని మత్స్యకారులు సహకరించాలన్నారు. దయచేసి చేపల వేటకు కానీ నదిలో పూజలు చేయడానికి చూడడానికి కానీ రావద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతోందన్నారు. విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సందర్శించడం స్నానాలు చేయరాదని కోరుతున్నామన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.