Sunday, December 29, 2024

రాజ్యాంగం పరిరక్షణతోనే దేశానికి భవిష్యత్తు

అమరావతి: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయాలను అందించిన రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ భారత రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు సహచర మంత్రులు, సీఎస్, శాఖాధిపతులు, ఉన్నతాధికారులు, రాష్ట్ర సచివాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం పరిరక్షణతోనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని, ఏ సమాజానికైనా, ఏ దేశానికైనా వారి రాజ్యాంగమే వారికి జీవధాతువులాంటిదని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 1947 ఆగష్టు 15న మనం స్వాతంత్య్రాన్ని సముపార్జించినప్పటికీ కూడా భారతదేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యాంగ ప్రపంచ దేశాల ముందు నిలబెట్టిన విధానం మాత్రం రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా భావించాలన్నారు. 26 నవంబర్, 1949న పార్లమెంట్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా భావిస్తున్న సందర్భంలో భారత రాజ్యాంగ రచనకు అధ్యక్షత వహించిన మహనీయులు డా.బి.ఆర్. అంబేద్కర్ ను ఈ సందర్భంగా ఘనమైన స్మృత్యంజలి ఘటించాల్సిన అవసరముందని సూచించారు. డా.బి.ఆర్ అంబేద్కర్ చూపించిన మార్గంలో శ్రేయోరాజ్యం అనే మాటను గుర్తు చేసిన మంత్రి దుర్గేష్ మన పీఠికలో వెల్ఫేర్ స్టేట్ అనే మాటతో రాజ్యాంగాన్ని ప్రారంభించారని తెలిపారు. భారతదేశం శ్రేయస్సును కోరుకునే విధంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, అట్టడుగు వర్గాల వారిని సమున్నత స్థానంలో నిలబెట్టేందుకు వారికి రిజర్వేషన్ కల్పించడం, సమాన పనికి సమాన వేతనం, మహిళలకు ప్రత్యేక హక్కుల కల్పన వంటి అంశాలు చూస్తే ప్రపంచంలోనే అత్యద్భుత లిఖిత రాజ్యాంగంగా పేరు పొందిన భారత రాజ్యాంగం అనేక మందికి మార్గదర్శకంగా నిలబడిందని వివరించారు. రాజ్యాంగం ఎంత గొప్పగా రచించబడ్డప్పటికీ కూడా దానిని అమలు చేసే వ్యక్తి చెడ్డవాడైతే అది చెడ్డగా మారుతుందని తెలుపుతూ అమలు చేసే వారు మంచి వారైతే అది అద్భుతంగా ముందుకు వెళ్తుందని సమకాలిన మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ఉటంకిస్తూ చెప్పవచ్చన్నారు.

చెడ్డగా మారుతుందనడానికి గడిచిన 5 సంవత్సరాల కాలం ఉంటే..అది అమలు చేసే వ్యక్తి మంచివారైతే అది అద్భుతంగా ఉంటుందనేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నిలువెత్తు ఉదాహరణగా చెప్పవచ్చని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ఉదహరించారు. ప్రధానంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని మనందరం పొందాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజకీయాల్లో సరైన అవకాశాలు లభించక ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే సమున్నత స్థానంలోకి రావాల్సిన వారున్నారో వారికి చేయూతనిచ్చి, బాసటగా నిలిచి వారిని ముందుకు తీసుకువస్తేనే రాజకీయాల్లో ఉన్నవారికి, రాజ్యాంగాన్ని నమ్మిన వారికి నిజమైన విధానంగా ఉంటుందని పేర్కొన్నారు.

దానిని పరిపూర్ణంగా పోషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి అన్నారు. ఈ పరిణామ క్రమంలో, 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భారత దేశ రాజ్యాంగం అనేక ఇబ్బందులకు లోనైందని, అనేక సార్లు సవరణలు చేశామని, అయినప్పటికీ సర్ బెనగల్ నరసింహారావు గారు, బీఎన్ రావు గారు చూపించిన మార్గదర్శకత్వం, మహనీయులు డా.బి.ఆర్. అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తికి భిన్నంగా ఆ మూలాలను దాటి ముందుకు వెళ్లలేదని చెబుతూ అది మన రాజ్యాంగం గొప్పతనం అని మంత్రి సభాముఖంగా తెలిపారు. 75 సంవత్సరాల రాజ్యాంగం ఆమోదం పొందిన రోజుకి పునరంకితులమవుదాం. శ్రేయోరాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేద్దామని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com