Sunday, September 29, 2024

రేవంత్ రాక‌.. ఇంటి బ‌య్య‌ర్ల‌కు కాక!

తెలంగాణలో భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఎంతమేర ధరలు పెంచాలన్నదానిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 ఒకసారి, 2022లో మరోసారి భూములు, స్థిరాస్తి మార్కెట్ విలువలను పెంచింది. కాంగ్రెస్ సర్కార్ కొలుదీరిన 6నెలల తరువాత భూముల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచనున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంతమేర భూములు, స్థిరాస్తుల విలువలు పెంచాలన్నదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం సబ్ రిజిస్టార్, ఎమ్మార్వో, పంచాయితీ రాజ్, మునిసిపల్, రెవెన్యూ, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను భాగస్వాములను చేసింది సర్కార్. ప్రస్తుతం ఉన్న భూముల ధరలు, పెంచాల్సిన విలువలపై ఆయా విభాగాలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేధిక ఇవ్వనున్నాయి. ఆ తరువాత రేవంత్ సర్కార్ రాష్ట్రంలో గ్రామాలు, మండలాలు, మునిసిపాలిటీలు, కార్పోరేన్ల వారిగా భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచనుంది. సచివాలయ వర్గాల సమాచారం మేరకు 40 నుంచి 60 శాతం మేర భూముల విలువలు పెంచనున్నారని తెలుస్తోంది.

ఫైనల్ గా పెంచిన భూములు, స్థిరాస్తుల ధరలు ఆగష్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వార ప్రభుత్వానికి సుమారు 15 వేల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇప్పుడు పెంచబోతున్న భూముల మార్కెట్ విలువలతో ప్రతి సంవత్సరం 4 వేల నుంచి 4,500 కోట్ల రూపాయల ఆదాయం పెరగనుందని అధికారుల అంచనా. అంటే భూముల విలువలు పెంచిన తరువాత ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వార ప్రతి సంవత్సరం సుమారు 20వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది.

ఇక తెలంగాణ ప్రభుత్వం పెంచుతున్న భూముల విలువల వల్ల స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకం దారులను కలిగే ప్రయోజనాలేంటీ, నష్టాలేంటి అని బేరీజు వేసుకుంటే చాలా అంశాలున్నాయి. పెరిగిన స్థిరాస్తుల విలువలకు అనుగునంగా ఇకపై స్టాంప్ డ్యూటీ, రిస్ట్రేషన్ భారం పెరుగుతుంది. అంతే కాకుండా స్థిరాస్తి కొనుగోలు దారులకు క్యాష్ పోర్షన్ తగ్గి, వైట్ పోర్షన్ పెరుగుతుంది. దీనివల్ల స్థిరాస్తి విలువ పెరిగి మార్టిగేజ్ తో పాటు బ్యాంకులో ఇతరత్రా లోన్స్ తీసుకునే వారికి ఎక్కువ మొత్తంలో లోన్ లభిస్తుంది. ఇక మన భుములు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, పరిశ్రమల స్థాపన, ఇతర అభివృద్ది కార్యక్రమాలకు భూములను సేకరించినప్పుడు పరిహారం ఎక్కువ మొత్తంలో లభిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular