Wednesday, January 8, 2025

దోషులు చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు..

  • జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వొచ్చాయి?
  • దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా బిఆర్ఎస్‌ ఎలా ఎదిగింది?
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమ‌ర్శ‌లు

తప్పు ఎప్పటికైనా బయటపడుతుంద‌ని, తప్పు చేసిన వారు చ‌ట్టం నుంచి తప్పించుకోలేరని రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేటిఆర్‌పై ఏసిబి విచార‌ణ‌పై ఆయ‌న స్పందించారు. కోర్టులు, వ్యవస్థల ముందు బలప్రదర్శన చేయడం స‌రికాద‌ని, త‌మ‌కు బిఆర్ఎస్ నాయకులు టార్గెట్ కాదని, మేము ఎవరినీ టార్గెట్ చేయడం లేదన్నారు. కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారు? కోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ ట్వీట్ పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెటైర్లు వేశారు. కేటీఆర్ మారలేదు..ఆయన రైటర్ మారినట్లుంద‌న్నారు. కొత్త సంవత్సరంలో కేటీఆర్ లో స్పిరిట్ పెరిగింద‌ని, కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఎందుకు ఇచ్చారో అప్పుడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ చెప్పాల‌ని, బాండ్స్ మాత్రమే కాదు ఇంకా బయట పడాల్సినవి చాలా ఉన్నాయన్నారు.

విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకు వెళ్ళాయో తేలాల‌ని, ప్రాంతీయ పార్టీల్లో ధ‌నిక పార్టీ బిఆర్ఎస్ అని, అంత డబ్బు ఎలా వచ్చింద‌ని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ కేసులో ఉన్నా .హరీష్ అక్కడ ఉంటారని విమ‌ర్శించారు. . రేవంత్ రెడ్డి కి…కాంగ్రెస్ ప్రభుత్వానికి.. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన లేదని, . ఏది బయట పడినా అందులో ఆ కుటుంబం పాత్ర ఉంటుంద‌న్నారు. ఇప్పటివరకు వేసిన కేసులు, విచారణ కమిషన్లు బిఆర్ఎస్ వాళ్లు అడిగితేనే వేశామ‌ని, కాళేశ్వరం, విద్యుత్, ఈ-ఫార్ములాపై విచారణ వారే అడిగారని, కక్షపూరితంగా చేసింది ఏమీలేదు. వ్య‌వ‌స్థ‌లో వారు తప్పులు చేశారు కాబట్టే అన్నీ బయటపడుతున్నాయని, జైలుకు వెళ్తేనే సిఎం అవుతాను అనుకుంటే కేటీఆర్ కంటే ముందు కవిత ఉన్నారు. ఇవేవీ లాభనష్టాల కోసం జరుగుతున్నవి కాదు. అరవింద్ కుమార్ నిజాలు చెప్తే అన్ని బయటకు వొస్తాయన్నారు. జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వొచ్చాయి..

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దేశం గురించి తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదు. సంక్రాంతి పండుగ తరువాత రికార్డుల ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నామ‌ని, భూదాన్, దేవాదాయ, అసైండ్ భూముల్లో జరిగిన కుంభకోణాలన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ లో బయటపడతాయని మంత్రి పొంగులేటి స్ప‌ష్టం చేశారు. సిరిసిల్లలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంద‌ని, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన భూ బాగోతం ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత బయట పడుతుంద‌న్నారు. భు భారతి బిల్లు గవర్నర్ వద్ద ఉంద‌ని, గవర్నర్ నుంచి అనుమతి రాగానే గెజిట్ విడుదలవుతుంద‌ని చెప్పారు. రూల్స్ ప్రేమ్ చేయడానికి రెండు నెలల టైం పడుతుంద‌ని, సియోల్ బాంబులు పేలడం మొదలు అవుతున్నాయన్నారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వొచ్చింద‌ని, ప్రభుత్వం లీగల్ ఒపినియన్ తీసుకుంటోంద‌ని, కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంద‌ని, ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా .కొనసాగుతుంద‌ని తెలిపారు. తాను మంత్రి అయ్యాక త‌మ‌ జిల్లా మాజీ మంత్రికి తాను ఎదురుపడలేదు, అసలు ఉన్నాడా? లేడా అన్నట్లు నడుస్తోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com