Friday, November 15, 2024

దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ది

* దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ది
* విద్వేష రాజకీయాలకు పునాది బీజేపీ
* అర్బన్ నక్సల్స్ అంటూ ప్రధాని మోడీ విద్వేషపూరిత వ్యాఖలను ఖండిస్తున్నా
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సుదీర్ఘమైన జాతీయోద్యమ నేపథ్యం , దేశ దాష్య శృంఖలాలు తెంచడం కోసం జైళ్ళు నిర్బంధాలు
త్యాగాలు చేసిన నేపథ్యం కాంగ్రెస్ కి మాత్రమే ఉందని, దేశ సమగ్రత, సమైఖ్యత కోసం ప్రజా స్వామిక విలువల కోసం కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ అని , దేశం కోసం  ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం
కాంగ్రెస్ మొదటి నుండీ ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క అన్నారు.
అంతటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అవినీతిపరులు , విభజన వాదులు , అర్బన్ నక్సలైట్ లు అనడం ప్రధాని స్థాయికి తగ్గ మాటలు కావు అని అన్నారు.
ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన కుటుంబం గాంధీ కుటుంబం అనీ, దేశ  రక్షణ కోసం సమగ్రత  శుక్షిరత కోసం , శాంతి కోసం ,స్వావలంబన కోసం తన ప్రాణం త్యాగం చేసిన మహాత్మా గాంధీ అని అన్నారు..
గాంధీ నడయాడిన వార్ధా కేంద్రంగా ప్రధాని ఈ వ్యాక్యలు చేయడం శోచనీయమని భట్టి విక్రమార్క అన్నారు
ఓట్ల కోసం సీట్ల కోసం  దేశంలో మత విద్వేషాలు రాజేసేది కేవలం బిజేపి పార్టీ మాత్రమే ఇది ప్రజాస్వామిక స్ఫూర్తికి మంచిది కాదు అని హితవు పలికారు.
ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొంతెత్తే వాళ్ళను దేశ ద్రోహులుగా అర్బన్ నక్సల్స్ గా ముద్రించి నిర్భంధ పాత్ర పోషిస్తున్న దే బిజేపి అని అన్నారు.
ఈ దేశం లో మోడీ అమలు పరుస్తున్న ప్రజాస్వామిక వ్యతిరేకత ప్రశ్నించే క్రమంలోనే రాహుల్ గాంధీ దేశం మొత్తం భారత్ జోడో యాత్ర చేసిన విషయం మర్చిపోవద్దు అని అన్నారు . జోడొ యాత్ర లక్ష్యమే దేశం లో పెచ్చురిల్లిన మత విద్వేషం, రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామిక విలువల పునాదిగా బయలుదేరింది అని అన్నారు
కాంగ్రెస్ లో విద్వేషం లేదనీ ఈ దేశంలో మత రాజకీయాలు విద్వేష రాజకీయాలకు అబద్దాల పునాది గా పనిచేసేది బిజేపి నే అని ప్రజలు గమనిస్తున్నారు అని
కాంగ్రెస్ మీద నిరాధారమైన ఆరోపణలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular