ప్రభుత్వం ఆశించింది రూ.85 వేల కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం రూ.72,157 కోట్లే…
ఈ ఆర్థిక సంవత్సరం (2023, 24) వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రూ.72,157 కోట్లు వచ్చింది. జిఎస్టీ రూపంలో రూ.40,650 కోట్ల ఆదాయం రాగా పెట్రోల్ పన్ను రూపంలో రూ.15,415 కోట్లు, మద్యం పన్ను రూపంలో రూ.14,570 కోట్లు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే తెలంగాణలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఈసారి 10 శాతం వృద్ధి చెందగా పెట్రోల్ పన్నుల్లో 3శాతం, మద్యం పన్ను రూపంలో 2 శాతం ఈసారి వృద్ధి రేటు పెరగడం విశేషం. అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2023, 24) వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రూ.85 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వం ఆశించగా రూ.72,157 కోట్లు మాత్రమే రావడం విశేషం. అయితే కేంద్రం నుంచి వచ్చే కాంపసేషన్ ఈ ఆర్థిక సంవత్సరం లేకపోవడంతో మరో రూ.5 వేల నుంచి రూ.8 వేల కోట్ల ఆదాయం లేకపోవడంతో ఆదాయం తగ్గిందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొన్నారు.
SGST ఎస్‌జిఎస్‌టి ద్వారా రూ.20,012 కోట్లు
2022, 23 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌జిఎస్‌టి రూపంలో రూ.16,876 కోట్లు రాగా, 2023, 24 ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20,012 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కన్నా రూ.3,136 కోట్లు అధిక ఆదాయం ఎస్‌జిఎస్‌టి రూపంలో వచ్చింది.
IGST ఐజిఎస్‌టి ద్వారా రూ.20,638 కోట్లు
2022, 23 ఆర్థిక సంవత్సరంలో ఐజిఎస్‌టి రూపంలో రూ.20,150 కోట్లు రాగా, 2023, 24 ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20,638 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కన్నా రూ.488 కోట్లు అధిక ఆదాయం ఐజిఎస్‌టి రూపంలో వచ్చింది.
పెట్రోల్ పన్నుల ద్వారా రూ.15,415 కోట్లు
2022, 23 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ద్వారా పన్నుల రూపంలో రూ.15,342 కోట్లు రాగా, 2023, 24 ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,415 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కన్నా రూ.73 కోట్లు అధిక ఆదాయం ఐజిఎస్‌టి రూపంలో వచ్చింది.
మద్యం పన్నుల ద్వారా రూ.15,415 కోట్లు
2022, 23 ఆర్థిక సంవత్సరంలో మద్యానికి పన్నుల రూపంలో రూ.14,174 కోట్లు రాగా, 2023, 24 ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.14,570 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కన్నా రూ.396 కోట్లు అధిక ఆదాయం మద్యం ద్వారా వచ్చింది. 2023, 24 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో జీఎస్టీతో పాటు మిగతా పన్నులు కలుపుకొని వాణిజ్య పన్నుల శాఖకు మొత్తంగా రూ.85 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆ శాఖ అధికారులు ఆశించగా రూ.రూ.72,157 కోట్లు రావడం గమనార్హం. అయితే గత సంవత్సరం ఈ శాఖకు ఆదాయం రూ.72,421 కోట్ల ఆదాయం రాగా ఈసారి రూ.264 కోట్ల ఆదాయం తగ్గిపోవడంపై ఆ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.