ఖరారు చేసిన టీఏఎఫ్‌ఆర్‌సీ
రాష్ట్రంలోని ఎంబీఏ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ మండలి (టీఏఎఫ్‌ఆర్‌సీ) నూతన రుసుములను ఖరారు చేసింది. వచ్చే మూడు సంవత్సరాల కాల వ్యవధికి (2025–-2028 వరకు) ఫీజులను నిర్ణయించాలంటూ రాష్ట్రంలోని 249 ఎంబీఏ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. కాలేజీల ప్రతినిధులతో చర్చించిన మీదట ఖరారు చేసిన మొత్తాలను కమిటీ తెలియజేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు గరిష్ఠ రుసుము రూ.1.10 లక్షలుగా ఉండగా ఇప్పుడు ఇది రూ.1.40 లక్షలకు పెరిగింది. కనిష్ఠం రూ.35 వేలుగా ఉంది. సీబీఐటీకి గరిష్ఠ ఫీజు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
కాగా ఈసారి పలు కాలేజీలకు రూ.లక్ష దాటడం గమనార్హం. కొత్త ఫీజులను ప్రభుత్వం ఆమోదించి జీవో జారీ చేయాల్సి ఉంటుంది. మార్పులు చేర్పులు చేయాలని సూచించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నందున స్వల్ప మార్పులకు అవకాశం ఉంటుందని సమాచారం. అన్ని రకాల కోర్సులకు సంబంధించి ఖరారు చేసిన ఫీజులపై చర్చించాలని టీఏఎఫ్‌ఆర్‌సీ వచ్చే వారం ప్రభుత్వాన్ని కోరుతుంది. విద్యాశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మీటింగ్ అనంతరం జీవోలు జారీ చేస్తారు. బీసీ, ఓసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.27,000 మంజూరు చేస్తారు.
కాలేజీ పాత ఫీజు కొత్త ఫీజు
- సీబీఐటీ 90,000 1,40,000
- విశ్వ విశ్వాని 90,000 1,35,000
- భవన్స్ వివేకానంద 1,10,000 1,23,000
- భద్రుక 85,000 1,05,000
- పెండేకంటి 1,00,000 1,05,000