Friday, September 20, 2024

జర్నలిస్టు సంక్షేమ పథకాలు పునర్ధరించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది 

* జర్నలిస్టు సంక్షేమ పథకాలు పునర్ధరించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది      
* ఏ.పీ.ఎం.పీ.ఏ.నాయకులకు రాష్ట్ర మం త్రులు కోలుసు పార్థసారధి, నారా లోకేష్ ల హామ
విజయవాడ, సెప్టెంబర్19 :  గత ప్రభుత్వం హయంలో ఆగిపోయిన జర్నలిస్టుల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం మరింత మెరుగ్గా తయారు చేసి  పునర్ధరించనున్నట్లు  రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  నారా లోకేష్ లు తమని కలసిన ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఏ.పీ.ఏం.పి.ఏ.) నాయకులకు తెలిపారు.  సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ని రాష్ట్ర సచివాలయంలో  ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ నేతృత్వంలో ఏ.పీ.ఎం.పీ.ఏ. నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మీడియా అక్రిడిటిషన్లు  సకాలంలో డిసెంబర్ 31 కల్లా ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి నీ కోరారు. జర్నలిస్టుల బీమా సౌకర్యం రూ 10 లక్షలు నుంచి 20 లక్షలకి పెంచి పునరుద్ధరించాలని కోరారు. విలేకరుల ఇళ్ల స్థలాలు, ఇళ్లు, అలాగే విలేకరుల వృత్తిలో 20 సంవత్సరాలు నిండిన వారికి పలు రాష్ట్రాల్లో అందిస్తున్న విధంగా  ప్రతి నెల రు.10,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు మంత్రి ని కోరారు. హెల్త్ కార్డు  అప్లోడ్లలో వస్తున్న ఇబ్బందులను తొలగించాలని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సారధి మాట్లాడుతూ తమ ప్రభుత్వము అధికారులకు వచ్చిన నెల రోజులలోనే జర్నలిస్టుల హెల్త్ కార్డుల జి . ఓ. ఇష్యూ చేశామన్నారు.  జర్నలిస్టు సమస్యలు పరిష్కారానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. అనంతరం ఏ.పీ. ఎం.పీ.ఏ.నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వారి నివాసం తాడేపల్లిలో కలిశారు.
మీ సమస్యలపై నాకు అవగాహన ఉంది తప్పనిసరి గా పరిష్కరిస్తాం
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హామీ
మీ సమస్యలపై నాకు అవగాహన ఉంది తప్పనిసరి గా వాటిని పరిష్కరిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆంద్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్  (ఏ పి ఎమ్ పి ఏ)రాష్ట్ర నాయకులకు హామీ ఇచ్చారు. ప్రధాన సమస్యలతో పాటుగా వార్షిక ఆదాయాలకు అతీతంగా  ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం లోనే సంతోషాన్ని వెతుక్కుంటున్న మీడియా ప్రతి నిధుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజు రాయితీ రాష్ట్రస్థాయిలోనే జీవో ఇచ్చి పునరుద్దించవలసిందిగా వారు మంత్రి లోకేష్ ను కోరారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర  ఉపాధ్యక్షులు మన్నె సోమేశ్వరరావు, ఇస్క రాజేష్, రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకటరమణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొడ్డు విజయ్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు మరకాల గోపి, సెక్రటరీ కళ్యాణపు సూర్య ప్రకాష్ రావు, పి ఆర్ ఓ మెటికల శ్రీనివాస రావు, జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు తదితరులు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular