Sunday, January 19, 2025

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి

వీధిలైట్ల నిర్వహణకు నిధుల కొరత
లోకల్‌ ‌బాడీలో మాది ఒంటరి పోరాటమే
బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గ్రామాల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో డియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏడు నెలలుగా జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని వీధిటైట్ల నిర్వహణకు నిధుల కొరత ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేస్తే.. అదే విధానాన్ని కాంగ్రెస్‌  ‌కొనసాగిస్తోందని విమర్శించారు. చెరువుల కబ్జాను అరికట్టే చట్టం గతంలో కూడా ఉందని.. పాత చట్టానికే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హైడ్రా అని పేరు పెట్టిందన్నారు. మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని.. అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో వోట్లు అడిగే హక్కు ఒక్క బీజేపీకు మాత్రమే ఉందని కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీపై కేంద్ర మంత్రి, టీ బీజేపీ చీఫ్‌ ‌కిషన్‌ ‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. లోకల్‌ ‌బాడీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

అలాగే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపైన కిషన్‌ ‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక కావాలంటే తప్పకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బ్యాక్‌‌గ్రౌండ్‌ ఉం‌డాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండుసార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న చాలు లేదా రెండుసార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు. మేడ్చల్‌ ఎం‌పీ ఈటల రాజేందర్‌ ‌కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్ఠానమే నిర్ణయిస్తుందని.. హైకమాండ్‌ ‌డెసిషనే ఫైనల్‌ అని తేల్చి చెప్పారు. కేసీఆర్‌ ‌తర్వాత బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఎవరో అందరికి తెలుసని.. అదే బీజేపీ తర్వాత అధ్యక్షుడు ఎవరో బీఆర్‌ఎస్‌ ‌చెప్పగలదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో నిర్ణయాలు డైనింగ్‌ ‌టేబుల్‌పై జరుగుతాయని ఎద్దేవా చేసిన కిషన్‌ ‌రెడ్డి.. బీజేపీలో అలా కాదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అబద్దాలు చెబుతున్నాడని.. అసలు రేవంత్‌ ‌రెడ్డి చెబితే దిల్లీ ప్రజలకు కాంగ్రెస్‌కు వోటేస్తారా అని నిలదీశారు.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ ‌పార్టీకి డిపాజిట్లు కూడా రావని కిషన్‌ ‌రెడ్డి జోస్యం చెప్పారు. ఉచితాలకు బీజేపీ వ్యతిరేకం  కాదని.. కానీ ప్రజలను మోసం చేయకుండా రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని హాలు ఇవ్వాలని సూచించారు. అలా కాకుండా అడ్డగోలు హాలు ఇచ్చి రాష్టాన్రి దివాలా తీయించే పరిస్థితులు తీసుకురావొద్దని సూచించారు. ఇక, నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ ‌వల్లే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు అయ్యిందన్న కాంగ్రెస్‌ ‌నాయకులను ఈడ్చి కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు కిషన్‌ ‌రెడ్డి.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com