Wednesday, April 9, 2025

”ది షార్ట్ కట్ ” ట్రైలర్

డి. ఎల్. ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ఆట సందీప్ హీరో గా నగ్న శ్రీ హీరోయిన్ గా రామక్రిష్ణ కంచి దర్శకత్వంలో తెరకెక్కిన ది షార్ట్ కట్ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ… ఆట సందీప్ హీరో గా ఎదగడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అయితే హీరో గా ఎంత ఎత్తుకు ఎదిగినా కొరియోగ్రాఫినీ మాత్రం విస్మరించవద్దని చెప్పారు. ది షార్ట్ కట్ సినిమా లో ఉన్న డైలాగులు కొన్ని సినిమా వాళ్ల జీవితాలకు అతి దగ్గరగా ఉన్నాయని అన్నారు. దర్శకుడు రామక్రిష్ణ సినిమాను చాలా బాగా తీశారని, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని శేఖర్ మాస్టర్ అన్నారు.

దర్శకుడు రామక్రిష్ణ కంచి మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటన్ సిటీలో రోజు రోజుకు పెరుగుతున్న డ్రగ్ కల్చర్ పై సినిమా తీశారని అన్నారు. డ్రగ్స్ వల్ల సమాజాని ఎంత ప్రమాదం అనే అంశాన్ని చెబుతూనే డ్రగ్స్ నివారణ కోసం ఏం చేయాలనే విషయాన్ని కూడా సినిమాలో చెబుతున్నామని అన్నారు. హీరో అట సందీప్ కు కథ చెప్పగానే చెప్పుకున్నాందుకు థ్యాంక్స్ చెప్పారు. హీరో అట సందీప్ మాట్లాడుతూ కథ బాగా నచ్చింది అని అన్నారు. కామెడీ తో పాటు యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా అని అన్నారు. ఈ సినిమాలో రీ రికార్డింగ్ కు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవుదామని ప్రయత్నిస్తున్న యువకుడి జీవితం ఎలా మారింది అనేదే సినిమా అని చెప్పారు.
హీరోయిన్ శగ్న శ్రీ మాట్లాడుతూ తాను చాలా మంచి పాత్ర పోషించానని అన్నారు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు రామక్రిష్ణ కు ఆమె క్రుతజ్ణతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com