Sunday, March 16, 2025

రాష్ట్ర ఖజానా మీలాంటి వాళ్ల  కోసం కాదు..

పైసా పైసా జమ చేస్తాం.. పేదలకు పంచుతాం
ప్రతీ పథకం వివరాలను లెక్కలతో సహా అందిస్తాం..  
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నలకు ఘాటుగా సమాధానం
రాష్ట్ర ఖజానా మీలాంటి రాజకీయ నాయకుల కోసం కాదు.. పైసా పైసా జమ చేస్తాం పేదలకు పంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  బిఆర్ఎస్ శాసన సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నలకు ఆయన ఘాటుగా స్పందించారు.  అన్ని విషయాలను  లెక్కలతో సహా వివరించారు. ఈ సందర్భంగా  డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. తప్పుడు సమాచారం ఇస్తున్నామని బిఆర్ఎస్ నేతలు  పదేపదే ఆరోపిస్తున్నారని,  మీలాగా ఆరేళ్లు పెండింగ్ లో పెట్టకుండా మేము మూడు నెలల్లోనే రైతు రుణమాఫీ చేశామన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గంలో 2018లో బిఆర్ఎస్ హయాంలో ఐదు సంవత్సరాల్లో 124 కోట్లు రుణమాఫీ చేస్తే.. మా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే 263 కోట్లు రుణమాఫీ చేసింది.. గజ్వేల్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 లో 104.3 కోట్ల
రుణమాఫీ చేసిందని, కానీ గజ్వేల్ లో తమ ప్రభుత్వం 237.33 కోట్ల రుణమాఫీ చేసిందని భట్టి విక్రమార్క తెలిపారు.
2018 లో సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ- 96.62 కోట్లు. సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ 177.91 కోట్లు. సిరిసిల్ల నియోజకవర్గంలో, 2018 లో 101.76 కోట్ల రుణమాఫీ చేస్తే .. తమ ప్రభుత్వం సిరిసిల్లలో రూ. 175.84 కోట్ల రుణమాఫీ చేసింది. శాసనసభ ప్రాంగణంలోనూ రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించిన సమాచారం డిస్ప్లే చేస్తాం. ప్రతి సంక్షేమ పథకం వివరాలు లెక్కలతో సహా ఎమ్మెల్యేలకు ఇస్తాం. గ్రామాల వారీగా ఫ్లెక్సీలపై డిస్ ప్లే చేశాం. రైతురుణమాఫీ మాత్రమే కాదు, సన్నాలకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రతి స్కీంకు సంబంధించిన వివరాలు లెక్కల తో సహా ఇస్తాం. మీలాగా పనులు చేయకుండా మేము ప్రచారం చేసుకోలేదు.
రాష్ట్రంలోని యూనివర్సిటీలను గాలికొదిలేస్తే మేము 12 మంది వీసీలను నియమించాం. సమాజంలో వెనుకబడిన వర్గాలను సైతం తీసుకున్నాం.. వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి మొదటిసారి మా ప్రభుత్వం ఒక దళితుల్ని వీసీ గా నియమించింది.. నగరం నడిబడ్డన ఉన్న మహిళ యూనివర్సిటీకి మీరు ఎప్పుడైనా వెళ్లారా .. మేము యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి.. కలియతిరిగి పాత వారసత్వ భవనాల మరమ్మతుకు వెంటనే రూ.15 కోట్లు విడుదల చేశాం. ఇవి కాకుండా రూ.540 కోట్లు భవనాలు కట్టడానికి వెంటనే ఆదేశాలిచ్చాం. ఇది బంధం.. మా అనుబంధం.. ముఖ్యమంత్రి మా రాష్ట్ర ప్రభుత్వ కమిట్మెంట్ అని అన్నారు.
ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నా భూతో న భవిష్యత్. 20 ఎకరాల్లో డిజిటల్ బోర్డులు, క్రికెట్, ఫుట్ బాల్  మైదానాలు, బోధన సిబ్బంది అక్కడే ఉండేలా నిర్మాణాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకేసారి 58 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేయలేదు. మేము ఒక్కో స్కూలును రూ.200 కోట్లతో నిర్మిస్తున్నాం. ఇది మా సీఎం కమిట్మెంట్, ఎస్సి, బిసి, ఎస్టి వర్గాలు విద్యారంగంపై మా ప్రభుత్వ కమిట్మెంట్ ఇది. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించి.. మహీంద్రా అండ్  మహీంద్రా వంటి బడా పారిశ్రామికవేత్తలను పిలిచి వారికి కావాల్సిన నైపుణ్యాలు విద్యార్థులకు నేర్పించి రిక్రూట్మెంట్ కు అవకాశాలు కల్పిస్తున్నాం.
పరిశ్రమలకు అవసరమైన నిపుణులను అందించేందుకు 65 ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నాం. ముఖ్యమంత్రికి సమయం లేదు.. విద్యాశాఖను పట్టించుకోవడం లేదంటూ భావించడం సరి కాదు..  సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు చేస్తున్న సేవలు చూసి గర్విస్తున్నాం.  మీ సీఎం లాగానే మా సీఎం కూడా ఉండాలని ఊహించుకుంటే ఎలా? 11 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాం.  మరో ఆరువేల ఖాలీల భర్తీకి కృషి చేస్తున్నాం.  22,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. విద్యాశాఖలో 36,000 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. . రాష్ట్ర ప్రజలకు లబ్ది జరగద్దు అనేది బిఆర్ఎస్  ఆలోచన అని ఆయన ఆరోపించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com