Monday, April 21, 2025

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపులు మనీష్ సిసోడియాకు బెయిల్‌

  • ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపులు
  • మనీష్ సిసోడియాకు బెయిల్‌
  • కవితకు నిరాశే
  • వచ్చేవారం బెయిల్​ వస్తుందన్న కేటీఆర్​

ఢిల్లీ లిక్కర్ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేయడంతో గత 17నెలలుగా జైలులో ఉన్నమాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన మనీశ్ సిసోడియాను ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతు సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరటదక్కింది. మనీశ్ బెయిల్ పిటిషన్ విచారించిన జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని, కేసు విచారణలో పురోగతి లేకపోయినా.. ఒక పరిమితి దాటిన తర్వాత ఆ (వ్యక్తిని జైలులో ఉంచడం సరికాదని, అలాకాదంటే ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుందని వ్యాఖ్యానించింది. బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం వారి హక్కు అని, ‘బెయిల్ అనేది నియమం.. జైలు మినహాయింపు’ అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో త్వరలోనే లిక్కర్ స్కామ్‌లోని మిగతా నిందితులకు కూడా బెయిల్ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

ఆప్ శ్రేణుల సంబరాలు..ఆనందపడొద్దన్న బీజేపీ

మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు పట్ల ఆప్ శ్రేణుల్లో సంబరాలు వ్యక్తమయ్యాయి. గతంలో మనీశ్ సిసోడియా శంకుస్థాపన చేసిన ఓ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అతిథి తన ప్రసంగంలో ఈ రోజు నిజం గెలిచిందని, ఢిల్లీ విద్యార్థులు గెలిచారని, పేద పిల్లలకు సిసోడియా మెరుగైన విద్యను అందించడం, వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడం కొందరికి నచ్చలేదన్నారు. అందుకే తప్పుడు కేసులో జైలుకు పంపించారని, కానీ, ఇప్పుడు ఆయనకు న్యాయం జరిగింది” అని చెబుతూ ఉద్వేగానికి లోనై వేదికపైనే కంటనీరు పెట్టుకున్నారు. సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా సిసోడియా బెయిల్‌పై స్పందిస్తూ కొన్నిసార్లు న్యాయం అలస్యం కావొచ్చేమో.. కానీ అన్యాయం మాత్రం జరగదు’ అని పోస్ట్ చేశారు. ఈ రోజు నిజం గెలిచిందని, సుప్రీం బెయిల్‌ తీర్పు నియంతృత్వానికి చెంపదెబ్బ అని ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్‌, రాఘవ్ చద్దాలు అభివర్ణించారు. బీజేపీ మాత్రం మనీశ్ సిసోడియా బెయిల్‌పై భిన్నంగా స్పందించింది. బెయిల్ వచ్చిందని మరీ ఆనందపడొద్దని, “కోర్టు తీర్పులను బీజేపీ గౌరవిస్తుందని,కానీ, బెయిల్ వచ్చినంతమాత్రాన.. కేసు నుంచి విముక్తి లభించినట్లు కాదని పేర్కోంది. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, కేసు దర్యాప్తు జరుగుతోందని, సాక్ష్యాలు, నిజాలు బయటకు వస్తాయంటూ వ్యాఖ్యానించింది. ఇక, మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ వచ్చిన వార్తను ఆప్‌ ఎంపీ రాఘవ్‌ ఛద్దా ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ఢిల్లీ విద్యారంగ విప్లవానికి కథానాయకుడైన మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ రావడంతో యావత్‌ దేశం సంతోషంగా ఉన్నది. గౌరవనీయ సుప్రీంకోర్టుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ‘మనీశ్‌జీ 530 రోజులుగా జైల్లో ఉన్నారు. పేద ప్రజల బిడ్డలకు మెరుగైన భవిష్యత్తును ఇవ్వడమే ఆయన చేసిన నేరం. ప్రియమైన పిల్లలారా.. మీ మనీశ్‌ మామ తిరిగి వస్తున్నారు’ అని ఛద్దా పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com