Friday, May 9, 2025

పగటి పూట దొంగ తనాలు చేసే నేరస్థుడిని పట్టుకున్న టు టౌన్ పోలీస్ లు

ఎన్టీఆర్ జిల్లా  విజయవాడ : పగటి పూట దొంగ తనాలు చేసే నేరస్థుడిని పట్టుకున్న టు టౌన్ పోలీస్ లు.మహంతి పురం కు చెందిన షేక్ షబ్బీర్ @ బాబు ను అరెస్ట్ చేసిన పోలీసులు.
2 టౌన్ పోలీస్ స్టేషన్ లో విజయవాడ వెస్ట్ జోన్ ఏడీసీపీ జీ.రామకృష్ణ ప్రెస్ మీట్ కామెంట్స్:
నేరస్తుడు పగటి పూట తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుని చోరీలు చేస్తాడు
రమ్మి , చెడు వ్యసనాలకు బానిసై చోరీలు చేస్తున్నాడు
గడచిన రెండేళ్లలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మొత్తంగా 7 చోరీలకు పాల్పడ్డాడు
టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ ఉంది
నిందితుని కదలికలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు
పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా కోమల సెంటర్ దగ్గర అరెస్టు చేయడం జరిగింది
నిందితుడి దగ్గర నుంచి సుమారు నాలుగు లక్షల విలువచేసే 180 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం
నిందితుడిని కోర్టు లో హాజరపరుస్తున్నాం

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com