Sunday, May 4, 2025

థియేటర్‌లో ఈ స్టార్‌ హీరోలకి ఒక్క టికెట్‌ కూడా తెగడంలేదా?

– వీళ్ళతో సినిమాలు తీయాలంటే భయం
– నమ్మకాన్ని పోగొట్టుకున్నారు
– దీనికి డైరెక్టర్లే ప్రధాన కారణమా

సినిమా తీస్తున్నామంటే 24 విభాగాలపై దర్శకుడికి పూర్తి అవగాహన ఉండాలి. అందుకే కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అంటారు. ప్రతి సన్నివేశాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. మనల్ని నమ్మి నిర్మాత డబ్బులు పెట్టుబడిగా పెడుతున్నాడంటే అతను దేవుడితో సమానం. అతనికి రూపాయికి మరో రూపాయిని లాభంగా తీసుకురావడానికి కష్టపడాలి. డబ్బు మనదికాదులే సినిమా ఎలా తీసినా చెల్లు బాటవుతుందనుకుంటే అంతకుమించిన తప్పిదం మరొకటి ఉండదు. సినిమాను కూడా ఎలా పడితే అలా తీస్తామంటే కెరీర్ కూడా లేకుండా పోతుంది. ఇటువంటి సంఘటనలు తెలుగు సినీ పరిశ్రమలో తరుచుగా చోటుచేసుకుంటూనే ఉంటాయి. తాజాగా ఇటీవల విడుదలైన రెండు సినిమాలు కూడా కనీసం ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోకుండా ఘోరమైన ఫ్లాప్ ను మూటకట్టుకున్నాయి. అంచనాలు భారీగా ఉండేవికానీ.. విజయ్ దేవరకొండ – మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీస్టార్ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానరుపై దిల్ రాజు నిర్మించారు. పరశురామ్ దర్శకుడు. గీతగోవిందం తర్వాత పరశురామ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా కాబట్టి అంచనాలు భారీగా ఉండేవి. విడుదలైన తర్వాత సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఐదోరోజు థియేటర్లలో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు. దీనికి దర్శకుడే పూర్తి బాధ్యత వహించాలి. కథ చెప్పేటప్పుడు ఒకటి.. చెప్పిన తర్వాత మరోలా సినిమా తీస్తే అందరి కెరీర్ ప్రమాదంలో పడుతుంది. ఈ సినిమా ఇచ్చిన ఫ్లాప్ వల్ల పరశురామ్ కు ఇప్పుడు సినిమాలే లేవు. అతనితో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. మెగా కాంపౌండ్ నుంచి కూడా.. అలాగే మెగా కాంపౌండ్ కు చెందిన హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన మట్కా సినిమా కూడా థియేటర్లలో ఐదోరోజు ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు. దీంతో మెగా కాంపౌండ్ కు తీవ్ర పరాభవం ఎదురైంది. వరుణ్ తేజ్ సినిమాలన్నీ వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్న తరుణంలో కరుణకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అయినా ఆడుతుందనే నమ్మకాన్ని పెట్టుకున్నారు. అయితే మెగా అభిమానుల ఆశలను నీరుగారుస్తూ దారుణమైన పరాజయాన్ని ఈ సినిమా చవిచూసింది. భవిష్యత్తులో వరుణ్ తేజ్ తో సినిమా తీయాలన్నా, దర్శకుడు కరుణకుమార్ తో సినిమా తీయాలన్నా నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితిని మట్కా కల్పించింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com