జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్
కొంతకాలంగా ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూ
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ జూన్ 1 నుంచి బంద్ కానున్నాయి. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో ఎగ్జిబిటర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మూవీ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో థియేటర్స్ బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, సురేశ్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్స్ హాజరయ్యారు. ఈ నిర్ణయం మేరకు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ కానున్నాయి. సినీ పరిశ్రమలో ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని వారు తేల్చి చెప్పారు. అద్దె ప్రాతిపదికన సినిమాల ప్రదర్శన ద్వారా తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని థియేటర్ల ఓనర్లు తెలిపారు. తమ నిర్ణయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ గిల్డ్‌కు తెలియజేస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్ పేర్కొంది. ప్రొడ్యూసర్లు తమ నిర్ణయాన్ని గౌరవించి, తమకు సహకరించకపోతే జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశం సందర్భంగా ఎగ్జిబిటర్లు తమ సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను నిర్మాతలకు వివరించారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని, అద్దె పద్ధతి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. “అద్దె ప్రాతిపదికన థియేటర్లను ఇకపై నడిపించలేం. మాకు పర్సంటేజీ రూపంలోనే వాటా కావాలి. అప్పుడే మాకు గిట్టుబాటు అవుతుంది,” అని వారు తేల్చిచెప్పారు. తెలిసింది. ఈ మేరకు తమ డిమాండ్లను, నిర్ణయాన్ని వివరిస్తూ నిర్మాతలకు అధికారికంగా ఒక లేఖ రాయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, జూన్ 1 నుంచి విడుదల కావాల్సిన పలు సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా చిత్రాల విడుదలకు ఇబ్బందులు తలెత్తవచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిబిటర్ల నిర్ణయంతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త చర్చ మొదలైంది. ఈ సమస్యకు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కలిసి ఎలాంటి పరిష్కారం చూపిస్తారో అనేది ఇండస్ట్రీలో ఆసక్తిగామారింది.
ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య చాలాకాలంగా పర్సంటేజీలపై చర్చ సాగుతోంది. రెంటల్ విధానంలో మూవీస్ ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్స్ వాదిస్తుంటే.. వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్స్ తేల్చిచెప్పారు. దీంతో ఇరువురి మధ్య ఆ సమస్య అలాగే ఉండిపోయింది. ఈ వ్యవహారం నిర్మాతలకు సైతం ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో ఏర్పాటైన ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో పర్సంటేజీలు, గవర్నమెంట్ పాలసీలపై చర్చించారు. నిర్మాతలకు లేఖ రాయాలని నిర్ణయించారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లలో సినిమాల ప్రదర్శన పర్సెంటేజ్ ప్రకారమే జరుగుతుంది. అందులో నిర్మాతలు, మల్టీప్లెక్స్ యాజమాన్యం ఓ ఒప్పందం ప్రకారం సినిమాలు ప్రదర్శిస్తున్నారు.
కానీ సింగిల్ స్క్రీన్స్‌కు ఈ ప్రతిపాదన లేదు. అక్కడంతా అద్దె సిస్టమే నడుస్తుంది. అలా చేస్తే పెద్ద సినిమాలు విడుదలైనపుడు తమకు నష్టం వస్తుందంటున్నారు ఎగ్జిబిటర్లు. అప్పుడు నిర్మాతలకే లక్షలకు లక్షలు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ఈ మేరకు ఛాంబర్ కూడా స్పందించి నిర్మాతలకు లేఖ రాయనుంది. ఈ క్రమంలోనే జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు ఎగ్జిబిటర్లు. అయితే, ఈ మీటింగ్‌కు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నిర్మాతలు కమ్ ఎగ్జిబిటర్లు హాజరు కాలేదు. సురేష్ బాబు, దిల్ రాజు మాత్రమే హాజరయ్యారు. మరి ఈ చర్చలు ఫలిస్తాయా.. జూన్ 1 నుంచి థియేటర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఈ సినిమాలపై ప్రభావం
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవడంతో పలు సినిమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మే 30న భైరవం, జూన్ 5 ధగ్ లైఫ్, జూన్ 12న హరిహర వీరమల్లు, జూన్ 27న కన్నప్ప, జూన్ 20న కుబేర్, జులైలో కింగ్ డమ్ విడుదల కావాల్సి ఉంది. దీంతో వీటిపై ప్రభావం పడుతుంది.