Monday, November 18, 2024

అప్పుడు స్మిత.. ఇప్పుడు అమ్రపాలి.. సర్కారులో కీ రోల్​

టీఎస్​ న్యూస్​: ప్రభుత్వంలో మహిళా ఐఏఎస్​లు ఏదో ఓ సందర్భంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఒక్కో గవర్నమెంట్​లో ఒక్కొక్కరిది స్పెషల్​ గా మారింది. బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో ఓ ఐఏఎస్​ అధికారిణి సెంటర్​ పాయింట్​గా వ్యవహరిస్తే.. కాంగ్రెస్​ ప్రభుత్వంలో మరో అధికారిణి అదే స్థానంలో కూర్చున్నారు. అప్పుడు కూడా తమకు అనుకూల అధికారులకు పెద్దపీట వేయగా.. ఇప్పుడూ అదే జరుగుతున్నది. ఈ పరిణామాలు ప్రభుత్వ వర్గాల్లో హాట్​ టాపిక్​గా మారాయి.

స్మితా సబర్వాల్​ స్పెషల్​
బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో ఐఏఎస్​ అధికారి స్మితా సబర్వాల్​సీఎంఓలో కీలక స్థానంలో కొనసాగారు. కీలకమైన శాఖలకు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. గతంలో స్మితా సబర్వాల్​పై ఓ ఇంగ్లీష్​ పత్రికలో ఒక కార్జున్​ వస్తే.. దానిపై లీగల్​ పోరాటం చేసిన స్మితా సబర్వాల్​కు అప్పటి ప్రభుత్వం సపోర్ట్​గా నిలిచింది. అంతేకాదు.. కోర్టు ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించింది. అంతేకాకుండా కీలకమైన పోస్టింగ్​ల్లో కూడా స్మితా సబర్వాలు చెప్పిందే ఫైనల్ అన్నట్టుగా మారింది. కిందిస్థాయి ఉద్యోగుల పోస్టింగ్​ల్లో కూడా ఈ ఐఏఎస్​ అధికారిణి ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ డిప్యూటీ తహసీల్దార్​.. రాత్రి సమయంలో స్మితా సబర్వాల్​ ఇంటికి వెళ్లాడంటూ గతంలో కేసు కూడా నమోదైంది. ఇలా ప్రభుత్వంలో కీ రోల్​ పోషించిన ఆమెను ప్రస్తుతం ఫైనాన్స్​ కమిషన్​ మెంబర్​ సెక్రెటరీగా నియమించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అమ్రపాలి
ఇప్పుడు కాంగ్రెస్ ​ప్రభుత్వంలో అమ్రపాలి హవా మొదలైందని ఉన్నతాధికారుల్లో చర్చ సాగుతున్నది. సీఎం రేవంత్​ రెడ్డి నేతృత్వంలో అధికారుల మార్పుల నేపథ్యంలో కొంతమందికి కీలక పోస్టులను అప్పగిస్తున్నారు. అయితే, ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో పీఎంవో సెక్రటరీగా పని చేస్తున్న అమ్రపాలికి రేవంత్ సర్కార్ హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా కీలక బాధ్యతలు అప్పగించింది. దాంతో పాటు మూసీ డెవలప్మెంట్ సంస్థ ఇన్ చార్జి ఎండీ గా కూడా అమ్రపాలికి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ కీలక బాధ్యతలు చేపట్టిన అమ్రపాలి ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు కావడం విశేషం.

* ఏపీలోని ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహాంకు చెందిన అమ్రపాలి ఇప్పుడు రేవంత్​ సర్కారులో సెంటర్​ పాయింట్​. గతంలో అమ్రపాలి వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు. అమ్రపాలి తండ్రి కాటా వెంకట రెడ్డి ఆంధ్రా యూనివర్శిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్ గా పని చేశారు. అమ్రపాలి కుటుంబంలో అందరూ ఉన్నతాధికారులే. ఆమె సోదరి మానస గంగోత్రి ఐఆర్ఎస్ అధికారిణి. ప్రస్తుతం ఆమె కర్ణాటక కేడర్ లో ఇన్ కంట్యాక్స్ విభాగంలో పని చేస్తున్నారు. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు కేడర్ కు చెందిన 2010 ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్ లో డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

* అమ్రపాలి భర్త జమ్మూ పట్టణానికి చెందిన షమీర్ శర్మ 2011 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఆయన డామన్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఐఏఎస్ అమ్రపాలికి ప్రభుత్వం మరో కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా.. ఐటీ అండ్ ఎస్టేట్‌తో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఎండీగా అమ్రపాలి ఉన్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular