Thursday, November 14, 2024

corruption in amrit tenders అమృత్‌ ‌టెండర్ల అవినీతిపై ఆధారాలున్నాయ్‌

‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌తనకు ఇష్టమొచ్చిన కంపెనీలకు అర్హత లేకున్నా టెండర్లు కట్టబెడుతన్నారనితెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అవినీతికుంభకోణాల్లో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. అమృత్‌ ‌టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. సీఎంగా ఉండి రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌ ‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరామన్నారు.

దిల్లీలో కేటీఆర్‌ ‌మీడియాతో మాట్లాడుతూ.. అర్హత లేకపోయినా శోధా కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. రూ.1,137 కోట్లకు సంబంధించిన పనులు ఆ కంపెనీకి ఇచ్చారన్నారు. 2021-22లో శోధా కన్‌‌స్ట్రక్షన్‌ ‌నికర ఆదాయం రూ.2.2 కోట్లు మాత్రమేననిఅలాంటి కంపెనీకి రూ.800 కోట్ల టెండర్లు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని కేంద్రమంత్రిని కోరామన్నారు.  అమృత్‌ ‌పథకం టెండర్లకు సంబంధించి వెబ్‌సైట్‌లో వివరాలు లేవనికేంద్రం స్కీమ్‌లో అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular