కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్
విచారణలో తన పేరు ఉందని మాజీ సిఎం కెసిఆర్ బాధ పడటంలో అర్థం లేదని, గత ప్రభుత్వ హయాంలో అన్ని డిపార్ట్‌మెంట్లలో కెసిఆర్ ప్రమేయంతోనే స్కాంలు జరిగాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆదివారం ఈ నేపథ్యంలోనే తాజాగా ఎక్స్ వేదికగా ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.
తన పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పని చేస్తుందని కెసిఆర్ అనడం తప్పని ఆయన అన్నారు. ఆయా శాఖల మంత్రుల ప్రమేయం లేకుండా అన్ని స్కామ్‌లు జరిగాయని త్వరలో తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, మీకు ఎలాంటి చెడ్డపేరు తీసుకురావడం ప్రభుత్వం చేయదని అద్దంకి వ్యాఖ్యానించారు.