Sunday, March 9, 2025

వాళ్లిద్దరు కలిసి.. మమ్మల్ని ఓడించారు ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి శ్రీధర్ బాబు

మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని బీఆర్ఎస్, బీజేపీలు ఒకటయ్యాయని, కాంగ్రెస్‌ను ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామన్నారు. అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో బీఆర్‌ఎస్‌ చెప్పాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే బీజేపీతో బీఆర్ఎస్ మమేకం అయ్యిందని, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అలానే వ్యవహరించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ తరఫున ఈ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టలేదన్నారు. రవీందర్ సింగ్ కు వ్యక్తిగతంగా ఓట్లు వచ్చాయని, పరోక్షంగా రవీందర్ సింగ్ ను బీఆర్ఎస్ బలపరిస్తే పరిస్థితి ఇంకోలా ఉండేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికల్ బంధమన్నారు.

మమ్మల్ని ఓడించేందుకే..!
కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటయ్యాయని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ పార్టీని శ్రీధర్ బాబు నిలదీశారు. బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను బీజేపీ ఎలా లొంగదీసుకుందో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టం అయిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనన్నారు. ఆ రెండు పార్టీలను వేరువేరుగా చూడడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బీజేపీ ఓట్ల కోసం.. ఎన్నికల కోసం పోరాడుతోందన్నారు. ఆ పార్టీ ప్రజల కోసం ఎప్పుడూ పోరాటం చేయదన్నారు. ఉప ఎన్నికలు వస్తే సత్తా చటుతాం అనే బీఆర్ఎస్.. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క చోట కూడా ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై పోరాటం చేసి.. బీజేపీకి ఓట్లు వేయించిందన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com