Wednesday, May 7, 2025

అమితాబ్‌ని సరిగ్గా వాడింది వారే

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ ‘కల్కి 2898 ఎడి’. గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజైన ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమా, బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో పాటుగా ప్రధాన పాత్రధారుల నటన హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రకు, ఆయన నటనకు అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి. ‘కల్కి’ సినిమాలో అశ్వద్ధామ పాత్రలో నటించారు బాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. కృష్ణుడి శాపం వల్ల ద్వాపరయుగం నుంచి 6 వేల సంవత్సరాలకు పైగా భూమిపై జీవిస్తున్న అమరుడిగా కనిపించారు. ఈ ఐకానిక్ క్యారక్టర్ కు బిగ్ బీ పర్పెక్ట్ గా సూట్ అవ్వడమే కాదు, అద్భుతమైన నటన కనబరిచారు. 3 గంటల మూవీలో ఆయన 25 నిమిషాల పాటు కనిపించి, సినిమా మొత్తాన్ని ప్రభాస్ తో కలిసి తన భుజాలపై మోసారు. 81 ఏళ్ల వయసులోనూ ప్రభాస్ కు ధీటుగా యాక్షన్ సీన్స్ చేశారు. ‘ది హాబిట్’ ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లోని గాండాల్ఫ్ ను గుర్తు చేశారు. కల్కి సినిమా కోసం అమితాబ్ బచ్చన్ చాలా కష్టపడ్డారు. కర్రతో ఫైట్ సీక్వెన్స్ కోసం సెట్స్ లో ప్రాక్టీస్ చేశారు. అందుకే ఇప్పుడు భైరవ, అశ్వత్థామ పాత్రల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఇక అశ్వత్థామగా మేకప్ వేసుకోడానికి, దాన్ని తీసేయడానికి కొన్ని గంటల సమయం పట్టేదని చిత్ర బృందం తెలిపింది. అయినా సరే ఆయన అంతసేపూ ఎంతో ఓపికగా ఉండి, షూటింగ్ చేసేవారట. ఇది సినిమాపై ఆయనకున్న నిబద్ధత, అంకింతభావాలను తెలియజేస్తుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com