Monday, May 19, 2025

‘మిస్టర్ బచ్చన్’ నుంచి థర్డ్ రొమాంటిక్ మెలోడీ

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ పై ఎక్సయిట్మెంట్ పెరుగుతోంది. షోరీల్, మొదటి రెండు సింగిల్స్, టీజర్ థంపింగ్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ ఇప్పుడు మూవీ థర్డ్ సింగిల్- జిక్కీకి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. లేటెస్ట్ పోస్టర్ సూచించినట్లుగా, థర్డ్ సింగిల్ జిక్కీ మెలోడియస్ రొమాంటిక్ నెంబర్. పోస్టర్ రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ మెస్మరైజింగ్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తోంది.

ఈ సాంగ్ వారి ఆన్-స్క్రీన్ రొమాన్స్‌కు సెలబ్రేషన్ గా మాగ్నటిక్ పెర్ఫార్మన్స్ తో మెలోడీని బ్లెండ్ చేసేలా ఉండబోతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్ అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు .బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ టాప్ క్లాస్ లో వుండబోతోంది. ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదల కానుంది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com