Sunday, April 6, 2025

ఈసారి ఎంఐఎం కోటలు బద్దలుకొడతాం

అభివృద్ధిని కాంక్షించే వారు బీజేపీకి వోటేయ్యండి
•ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్‌,
‌బీఆర్‌ఎస్‌ ‌కుట్రలు
•కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

తమకు సంఖ్యా బలం లేదని అందరూ అంటున్నారని.. కానీ అభివృద్ధిని కాంక్షిచే వారు బీజేపీకే  వోటు వేయబోతున్నారని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.  శనివారం కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక అధికారంలో ఎవరు ఉన్నా మజ్లిస్‌కు హైదరాబాద్‌ ‌రాసి ఇవ్వడం అలవాటుగా మారిందన్నారు. అందులో భాగంగానే ఈసారి కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటే వాళ్లతో అంటకాగి హైదరాబాద్‌ను దోచుకోవడం ఎంఐఎంకు పరిపాటి అయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎంఐఎం కోటలు బద్దలు కొడతామని స్పష్టం చేశారు. సంఖ్యాబలం ఉంటే బీజేపీనే గెలిచేదని.. సంఖ్యా బలం లేదు కాబట్టే వోటింగ్‌ ‌జరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో 120 మంది వోటర్లు ఆచితూచి వోటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.  మజ్లిస్‌ ‌పార్టీని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. మజ్లిస్‌ ‌పార్టీ కనుసైగలో ఈ రెండు పార్టీలు నడుస్తున్నాయని అన్నారు.

కాంగ్రెస్‌, ‌బీజేపీ పార్టీలు రెండూ కూడా ఎంఐఎం పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ పెంచి పోషిస్తున్నాయన్నారు. మజ్లిస్‌కు వోటేస్తే ప్రజలెవరూ కూడా క్షమించరని అన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌, ‌మజ్లిస్‌ ‌పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ఈసారి కచ్చితంగా హైదరాబాద్‌ ‌నగరంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని.. మేయర్‌ ‌పీఠం మీద కూర్చోబోయేది భారతీయ జనతా పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ‌లోకల్‌ ‌బాడీ ఎన్నికలకు, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా, హిందువులకు, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చే పార్టీ మజ్లిస్‌ అం‌టూ మండిపడ్డారు. గతంలో హైదరాబాద్‌లో అనేక సార్లు మతకలహాలు ప్రేరేపించిందన్నారు.

అలాంటి మజ్లిస్‌ ‌పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు పోటీ చేయకుండా ఉండడం రాజకీయ కుట్రే అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు రెండూ కూడా ఎంఐఎంకు బానిసత్వంతో ఉండే పార్టీలని వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి మజ్లిస్‌ ‌పార్టీని ఓడిరచాలని… బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా వోటర్లను కోరారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండటం సహజమని చెప్పుకొచ్చారు. అలాంటివి ఏవైనా ఉంటే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com