Friday, December 27, 2024

బిజెపి కార్యకర్త పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి…

బిజెపి కార్యకర్త పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ: అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం చంద్రగిరి గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త కృష్ణ మూర్తి శెట్టి పై వేటకోడవళ్ళతో దాడి చేసి హత్య కు ప్రయత్నించి న వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి పోలీసు అధికారులు ను డిమాండ్ చేశారు.

ఈమేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. కృష్ణ మూర్తి శెట్టి కుటుంబం ధైర్యం గా ఉండాలని వారి రక్షణ విషయంలో బిజెపి అండగా ఉంటుందన్నారు. కృష్ణ మూర్తి శెట్టి పై అత్యంత పాశవికంగా దాడి కి ప్రయత్నం చేసి నా పాత్ర దారులు, సూత్రధారులు అందరినీ అరెస్టు చేయాలన్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ మూర్తి శెట్టి కి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com