Wednesday, April 2, 2025

ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

  • బంధువుల ఇంటికి వచ్చి ముగ్గురి మృత్యువాత

తొలి ఏకాదశి… మొహరం పండుగల వేల ఆ కుటుంబంలో తీవ్ర విషాదం బంధువుల ఇంటికి హైదరాబాదు నుంచి వచ్చిన ముగ్గురు ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో నీటిలో పడి మృతి చెందిన పలువురిని సూర్యాపేట జిల్లాలో ఈ విషాద ఘటన బుధవారం జరిగింది. కంకర రాయి కోసం తీసిన క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఓ బాలిక ఉన్నారు. ఆత్మకూరు (ఎస్) మండలంలోని బొప్పారం గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

మృతులు హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వచ్చి స్థానిక క్రషర్ గుంతల్లో ఈతకు వెళ్లినట్లు సమాచారం. చుట్టుపు చూపుగా వచ్చి ఒకేసారి ముగ్గురు మృత్యువాత పడటంతో బొప్పారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో హైదరాబాద్ నుంచి బొప్పారం వచ్చారు. మృతుల్లో రాజు, శ్రీపాల్ రెడ్డి ఉష గా గుర్తించారు.

ముందుగా ఉష మరో బాలుడు నీళ్లలోకి దిగగా మునిగిపోతున్న దశలో వారిని కాపాడేందుకు తండ్రి రాజు, శ్రీపాల్ రెడ్డి, కుమార్తె ఉషలు నీటిలోకి దిగి ముగ్గురు ఈత రాకపోవడంతో చనిపోయారు. మరొక బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com