Tuesday, December 24, 2024

బట్టలు ఉతకాలని పిలచి మహిళపై అత్యాచారం

తమ ఇంట్లో బట్టలు ఉతికే పని ఉందని ఓ మహిళను పిలిచిన ముగ్గురు కామాందులు ఆమెపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు కొండాపూర్ లోని ఓ భవనంలో పనిచేస్తోంది. సోమవారం ఉదయం పనికి వెళ్ళిన మహిళ సాయంత్రం భవనంలో పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది.

ఈ క్రమంలో ఆటోలో ముగ్గురు కామాందులు వచ్చి తమ ఇంట్లో బట్టలు ఉతకాలని మాయమాటలు చెప్పి తీసుకెళ్ళారు. రూమ్ లో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కామాందుల అఘాయిత్యంతో బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరో మహిళ అక్కడకు వచ్చి జరుగుతున్న దారుణాన్ని చూసి బిత్తరపోయింది.

అయితే మహిళ రావడాన్ని గమనించి ముగ్గురు కామాందులు అక్కడ నుంచి పరారయ్యారు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి సదరు మహిళకు చెప్పుకుని విలపించింది. దీంతో బాధితురాలితో కలిసి సదరు మహిళ మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, దారుణానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తరం ఆసుపత్రికి తరలించారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com