Monday, November 18, 2024

హత్యయత్నం కేసులో ముగ్గురు కి మూడు సంవత్సరాల జైలు శిక్ష

​​వ్యక్తి పై హత్యయత్నంకు కారణమైన ముగ్గురు రౌడి షీటర్స్ కి ఒక్కక్కరికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 1000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల అసిస్టెంట్ సబ్ కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ అఖిల్ మహజన్ గురువారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ చందుర్తి మండలం ఆశీరెడ్డి పల్లి గ్రామానికి చెందిన అంచ రాంరెడ్డి కి అదే గ్రామానికి చెందిన వివిధ కేసులలో రౌడి షీటర్స్ గా ఉన్న కట్కూరి స్వామి,గంగుల శ్రీను మరియు చింత శేఖర్ ల కు బావి పంచాయతీ విషయంలో తరచు గొడవలు జరుగగా, ఈ క్రమంలోనే స్వామి, శ్రీను, శేఖర్ లు రాంరెడ్డి ని చంపాలనే ఉద్దేశ్యంతో వారి వెంట తీసుకోని వచ్చిన కర్రతో దాడి చేసినారు అని తెలిపారు.

రాంరెడ్డి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అప్పటి చందుర్తి ఎస్ఐ నీలం రవి కేసు నమోదు చేసి కోర్టులో చార్జెషీట్ దాఖలు చేశారు అని అన్నారు.కోర్టు మనిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ లు తిరుపతి,లతీఫ్ ,సిఎంఎస్ హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య , కానిస్టేబుల్ మధులు 11 మంది సాక్ష్యులను ప్రవేశ పెట్టగా ప్రసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రసిక్యూటర్ వేముల లక్ష్మి ప్రసాద్ వాదించాగా,కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో ముగ్గురికి ఒక్కక్కరికి 3సంవత్సరాల జైలు శిక్ష 1000/- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని తెలిపారు.నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన పి పి వేముల లక్ష్మి ప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ తిరుపతి, లతీఫ్ ,సిఎంఎస్ హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య , కానిస్టేబుల్ మధు లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular