Sunday, September 29, 2024

రష్యాలో కాల్పులకు తెగబడ్డ దుండగులు

ఉగ్రవాదులతో సహా మత్తం 21 మంది మృతి

కాల్పులతో రష్యా అట్టుడికిపోయింది. గుర్తు తెలియని సాయుధులైన దుండగులు ఈ దారుణానికి పూనుకున్నారు. రష్యాలోని చర్చిలు, ప్రార్థనా మందిరాలు, పోలీసు అధికారులే లక్ష్యంగా ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటనలో తొమ్మిది మంది పోలీసులు, ఒక ప్రీస్ట్‌, ఓ సెక్యూరిటీ గార్డ్‌ సహా మొత్తం 11 మంది చనిపోయారు. పదలు సంఖ్యలో గాయపడ్డారు. దాడి చేసిన వారిలో ఆరుగురిని పోలీసు హలగాలు హతమార్చాయి.

దక్షిణ కాకస్‌ రిపబ్లిక్‌ డాగెస్థాన్‌ లో ఈ దారుణ ఘటన జరిగింది. డెర్బెంట్‌, మఖచక్కల నగరాల్లో ఆర్థోడాక్స్‌ వేడుకకు సంబందించిన పెండెకోస్ట్‌ను జరుపుకుంటుండగా ఒక్కసారిగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడున్నవారంతా భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు.
దాడులకు పాల్పడ్డ సాయుధుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాల్పులు జరిపిన నిందితులు ఎవరన్నదీ ఇంతవరకు పోలీసులు గుర్తించలేదు.

రష్యా లోని డాగెస్థాన్‌ లో గతంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డ ఘటనలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు రెండు చర్చిలు, రెండు ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాల్పులకు పాల్పడ్డ వారిని త్వరలోనే పట్టుకుంటామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular